అంబటి vs జనసేన.. ట్వీట్లతోనే ఏకిపారేస్తున్నారు!

Publish Date:Jun 30, 2023

Advertisement

వైసీపీ ఈ మధ్య కాలంలో టీడీపీ, జనసేన నేతలను టార్గెట్ చేయాలంటే సరిగ్గా క్యాస్ట్ ఈక్వేషన్స్ మైంటైన్ చేస్తుంది. చంద్రబాబు, లోకేష్ లాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని, సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏదైనా విమర్శిస్తే.. కొడాలి నాని లాంటి వాళ్ళు రంగంలోకి దిగి నోటికి వచ్చింది మాట్లాడి వెళ్తారు. అదే జనసేన నుండి పవన్ కళ్యాణ్ మీదకి అయితే పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కౌంటర్ల యుద్ధం మొదలు పెడతారు. ప్రతిపక్షాల నుండి ఎవరైనా వైసీపీ నేతల మీద విమర్శలు చేస్తే వాళ్ళు స్పందించకుండా.. విమర్శించిన వారి కులానికి సంబంధించిన వైసీపీ నేతలు వచ్చి విరుచుకుపడుతుంటారు. నిజానికి ఇది గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో మొదలవగా.. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఇలాంటి  కుల రాజకీయం పూర్తిగా ఓపెన్ అయిపొయింది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్  వారాహి విజయ యాత్రలో ఎక్కడిక్కడ వైసీపీ ప్రభుత్వంపై  విమర్శల యుద్ధం కురిపించారు. కురిపిస్తున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో వైసీపీ నుండి పవన్ పై పెద్దగా ఎదురుదాడి లేదు. ఏమనుకున్నారో ఏమో కానీ గతంలో కంటే ఈ మధ్య ఈ ఎదురు దాడి చాలా తగ్గింది. కానీ  మంత్రి అంబటి రాంబాబు మాత్రం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. నాలుగు రోజుల కిందట అంబటి.. పవన్ ను రోత స్టార్.. బూతు స్టార్ అంటూ తిట్ల దండకం మొదలుపెట్టారు.   సినిమా స్టార్.. ప్యాకేజి స్టార్.. కామెడీ స్టార్.. కోతల స్టార్.. రోత స్టార్.. బూతు స్టార్.. బా..గా.. పడిపోయావు పవన్ కళ్యాణ అంటూ రాసుకొచ్చారు. దీంతో జనసైనికులు అంబటిపై మండిపడ్డారు.

తాజాగా అంబటి రాంబాబు... పవన్ కల్యాణ్ పేరులో అర్ధాన్ని తనదైన శైలిలో వివరిస్తూ "సార్థక నామధేయుడు" అని ట్వీట్ చేశారు. పవన్ + కళ్యాణ్.. పవన్ = గాలి, గాలి, గాలి.. కళ్యాణ్ = కళ్యాణాలు.. సార్థక నామధేయుడు అంటూ ట్వీట్ చేశారు. దీంతో అంబటి చేసిన ఈ ట్వీట్ కు జనసేన సోషల్ మీడియా హ్యాండిల్ నుండి అంబటిపై గట్టి కౌంటర్ వేసింది. గతంలో అంబటి రాంబాబు మహిళలతో అసభ్యకరంగా మాట్లాడారంటూ హల్ చల్ చేసిన ఆడియో క్లిప్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన జనసేన.. దీనితో పాటు... పలువురు మహిళలతో అంబటి చాట్ చేసినట్లు ఉన్న కొన్ని వాట్సప్ చాట్ లను పోస్ట్ చేశారు. అనంతరం "సంబరాల రాంబాబు + సంజన + సుకన్య = ఆంబోతు కాంబాబు"... "సంబరాలు = వాట్సప్ రాసలీలలు.. అంబటి రాంబాబు = ఆంబోతు కాంబాబు" అని జనసేన బృందం ట్వీట్ చేసింది. 

అంతేకాదు, ముక్తసరిగా మహిళల గురించి ఊహాగానాలు చేయకుండా ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై దృష్టి సారించాలని మంత్రి అంబటికి చురకలంటించారు. మొత్తంగా చూస్తే జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో  ట్వీట్ల ద్వారా అంబటిని తరిమి తరిమి కొడుతున్నారు. ఈ ట్వీట్ల యుద్ధం ఇప్పట్లో ఆగేలా కూడా లేదు. అయితే జనసేన, వైసీపీ కార్యకర్తలు, నేతల మధ్య సాగుతున్న ఈ మాటల యుద్ధం ఒకరకంగా సాంప్రదాయ రాజకీయాలను  దాటేసి జుగుప్సాకరంగా మారిపోయింది. దీంతో బయట నుండి చూసే వారికి ఇది వెగటు కలిగిస్తోంది. పోలవరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలో మరెన్నో సమస్యలపై దృష్టి పెట్టాల్సిన మంత్రి ఇలా బజారుకెక్కి చిల్లర యుద్ధం చేయడం  మంత్రి అంబటిని మరింత దిగజారుస్తోంది. చూడాలి మరి అంబటి ఇంకెంత దిగజారే స్థాయికి వెడతారో?!

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.