కమలం గూటికి మాజీ క్రికెటర్ అంబటి?.. ఈ సారైనా నిలకడగా ఉంటాడా?

Publish Date:Jan 28, 2025

Advertisement

అంబటి రాయుడు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రొఫెషనల్ క్రికెటర్ గా మొదలై.. ఇప్పుడు రాజకీయాలలోకి ప్రవేశించారు. క్రికెటర్ గా అసమాన ప్రతిభ ఉన్నప్పటికీ స్థిరత్వం లేకపోవడం, దూకుడు, తొందరపాటు నిర్ణయాల కారణంగా అంబటి రాయుడు క్రికెట్  కెరీర్ తొందరగా ముగిసిపోయింది.   మాంచి ప్రతిభ గలిగిన క్రికెటర్ గా క్రీడాభిమానులకు చిరపరిచితుడైన అంబటి రాయుడు తన క్రికెట్ కెరీర్ ను తొందరపాటు నిర్ణయాలతో, దుందుడుకు పోకడలతో చేజేతులా నాశనం చేసుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశించడానికి వేచి చూసినంత కాలం పట్లలేదు ఆ క్రికెట్ కెరీర్ కు ముగింపు పలకడానికి. ఎంత ప్రతిభ ఉన్నా అతడిలో నిలకడ లేని తనం కారణంగా  అతడి క్రికెట్ కెరీర్ అర్ధంతరంగా ముగిసింది. ఆ తరువాత ఆయన  రాజకీయాలలో ప్రవేశించారు. అక్కడా అంతే నిలకడ లేకపోవడం, స్థిరత్వం కొరవడటంతో తొలి అడుగులోనే తడబడ్డాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జారి పడ్డాడు.   క్రికెట్ కెరీర్ కు ముగింపు పలికిన తరువాత అంబటి రాయుడు గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలన్న లక్ష్యంతో అడుగులు వేశాడు. నియోజకవర్గంలో కొంత కాలం చురుగ్గా పర్యటించి, ఒకింత ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు.

గుంటూరు లోక్ సభ నియోకవర్గం నుంచి బరిలోకి దిగాలన్న లక్ష్యంతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ గూటికి చేరారు.   గుంటూరు లోక్ సభ స్థానం హామీతో ఆయన వైసీపీ గూటికి చేరారని, అయితే చేరిన రోజుల వ్యవధిలోనే అక్కడి నుంచి పోటీకి అవకాశం లేదని గ్రహించి క్షణం ఆలోచించకుండా వైసీపీ గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆ వెంటనే తాను , విదేశాలలో క్రికెట్ టోర్నీలో పాల్గొనాల్సి ఉన్నందున  రాజకీయాల నుంచి చిన్న విరామం తీసుకున్నానని ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే వైసీపీ సామాజిక మాధ్యమంలో అంబటి రాయుడు తాడేపల్లిగూడెంలో జరిగి వైసీపీ సభలో పాల్గొన్న కొన్ని ఫొటోలను విడుదల చేసింది. ఇది జరిగిన వారం రోజుల వ్యవధిలోనే  జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. దీంతో అంబటిరాయుడు జనసేన తీర్ధం పుచ్చుకోనున్నారంటూ వార్తలు వినిపించాయి.  ఆ తరువాత కొద్ది రోజులకే ఆయన మళ్లీ వైసీపీకి చేరనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. సిద్ధం అంటూ చేసిన ట్వీట్ ద్వారా అప్పట్లో జగన్ సిద్ధం సభలకు సై అన్న సంకేతాలను ఇచ్చారు. ఇటువంటి నిలకడలేని తనంతో ఆయన తొలి అడుగులోనే రాజకీయాలలో ఒక జోకర్ గా ముద్ర పడ్డారు.

దీంతో గత ఎన్నికల ముందు అటు వైసీపీ కానీ, ఇటు జనసేన కానీ ఆయనను పెద్దగా పట్టించుకోలేదు.  సరే అది వదిలేస్తే ఇప్పుడు అంబటి రాయుడు కమలం గూటికి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నేడో రేపో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో అంబటి రాయుడు నుంచి ఎటువంటి ప్రకటనా లేకపోయినప్పటికీ విశాఖలో జరిగిన ఏబీవీపీ సభల్లో అంబటి రాయుడు పాల్గొన్నారు. ఆ సందర్భంగా అంబటి రాయుడు బీజేపీకి మద్దతుగా మాట్లాడారు. అంతే కాదు దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీ మాత్రమేనంటూ పొగడ్తల వర్షం కురిపించేశారు. దీంతో ఆయన కమలం గూటికి చేరడం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. ఏది ఏమైనా మరో సారి అంబటి రాయుడు పోలిటికల్ ఎరీనాలో కనిపించడంతో గతంలో ఆయన పిల్లిమొగ్గలు, కుప్పింగంతులపై నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  

By
en-us Political News

  
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.