అమరావతి సాకారం సత్వరం!

Publish Date:Oct 21, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇక చకచకా సాగుతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టత ఇచ్చారు. నిర్దిష్ట కాల వ్యవధిలో అమరావతి నిర్మాణం పూర్తి కావాలన్న కృత నిశ్చయంతో ఉన్న చంద్రబాబు.. మూడేళ్లలో అమరావతి పూర్తి చేయాలన్న విస్పష్ట ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇక అమరావతి పనులు పరుగులు పెడతాయనడంలో సందేహం లేదు. 

జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో ఆయన అమరావతిపై కక్ష కట్టినట్లుగా వ్యవహరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి నిర్మాణ పనులను ఆపేశారు. వైసీపీ నేతలు, మంత్రులు అయితే అమరావతిని శ్మశానంతో పోల్చారు. భ్రమరావతి అని ఎగతాళి చేశారు. గ్రాఫిక్స్ అంటూ ఎద్దేవా చేశారు. అదే రాజధాని అమరావతిలో చంద్రబాబు హయాంలో నిర్మాణమైన సచివాలయం, అసెంబ్లీలో కార్యకలాపాలను కొనసాగిస్తూనే అమరావతిపై దుష్ప్రచారం చేశారు.  2019లో ప్రభుత్వం మారడంతో పనులకు బ్రేక్ పడ్డాయి.ఆ ప్రదేశాలు పిచ్చిమొక్కలకు ఆలవాలమైంది.అమరావతి రాజధానికి పొలాలు ఇచ్చిన రైతులు ఇక్కడే నిర్మించాలని ఉద్యమం చేసారు.వైసీపీ ప్రభుత్వం అమరావతి కి వ్యతిరేకంగా మూడురాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారు.విశాఖను చేస్తామన్నారు.చివరికి ఐదేళ్లు రాజధాని లేకుండా,రాకుండా గడిపేశారు.  2024లో  కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతి పేరు బయటకువచ్చింది. కేంద్రం కూడా పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు  ముందుకు వచ్చింది. అయితే గత ఐదేళ్ల జగన్ నిర్వాకం కారణంగా అమరావతి మొత్తం పిచ్చిచెట్లు, తుప్పలతో జంగిల్ గా మారింది. దీంతో చంద్రబాబు సర్కార్ తొలుత యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లయరెన్స్ పనులను చేపట్టింది. జంగిల్ క్లియరెన్స్ పూర్తి కావడంతో శనివారం అమరావతి పనులను పున: ప్రారంభించారు. 

సచివాలయం,అసెంబ్లీ,కొన్ని కార్యాలయాలు బాబు హాయాంలో గతంలో పూర్తిఅయ్యాయి. అధికారుల,ఉద్యోగుల క్వార్టర్స్ సగంలో ఆగిపోయాయి. మరికొన్ని నిర్మాణాలు చివరిదశలో ఆగిపోయాయి. రాజధాని కోసం 54వేల ఎకరాలను సేకరించామని సీఎం చంద్రబాబు చెప్పారు.దీనిలో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములు 30వేల ఎకరాలుపైగా ఉన్నాయి. గత ఐదేళ్లుగా రాజధాని రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను కూడా చంద్రబాబు క్లియర్ చేసారు. పోలవరం కొంచం ఆలస్యమవచ్చుగానీ అమరావతి విషయంలో ఎటువంటి జాప్యం ఉండదని చంద్రబాబు ఉద్ఘాటించారు. రహదారులు, ఇతర సంస్థల ఏర్పాటుతో పాటు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చేలా   ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సీఆర్డీఏ రాజధాని నిర్మాణ బాధ్యతలను చేపట్టనుంది. హైదరాబాద్ ను తలదన్నేలా, ప్రపంచ స్థాయి నగరంలో అమరావతిని నిర్మించాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు.  హైటెక్ సిటీ,సైబరాబాద్ నిర్మాణాలు చంద్రబాబు హయాంలోనే జరిగాయి.వాటికి దీటుగా అమరావతిని తీర్చిదిద్దే ఆలోచనలో ఆయన ఉన్నారు. 

మామూలుగా బాబు ఐదేళ్లలో అమరావతి, పోలవరం పూర్తిచేయాలని సీఎంకాగానే తలచారు. విశాఖ  ఆర్ధిక రాజధానిగా, సినీపరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దాలని భావించారు. అలాగే కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేసి వారినీ అభివృద్ధిలో భాగస్వాములు చేసే ఆలోచనలో ఉన్నారు.అమరావతి రాష్ట్రానికి సెంటర్ పాయింట్. రాజధానికి ఇక్కడే నిర్మిస్తే ప్రజలకు సౌకర్యాలతో పాటు అందుబాటులో ఉంటుందని చంద్రబాబు భావన.

అయితే బీజేపీ జమిలి ఎన్నికల బాటలో పయనిస్తుండటంతో ముందస్తు ఎన్నికలు తప్పవన్న నిర్దారణకు వచ్చిన చంద్రబాబు అందుకు అనుగుణంగా అమరావతి నిర్మాణ వ్యవధిని కుదించారు.  మూడేళ్లలో రాజధాని పూర్తికావాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా ముందుకు పోతున్నారు.అలాగే సూపర్ సిక్స్ హామీలను కూడా  జనవరి నుంచే అమలు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి అత్యాధునిక రాజధాని మూడేళ్లలో సాకారం కావడం తథ్యమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.