అమరావతి.. అడుగులు కాదు పరుగులు!

Publish Date:Oct 18, 2024

Advertisement

గత ఐదేళ్లుగా   రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశ వ్యాప్తంగా నవ్వుల పాలు కావడానికి కారణమైన జగన్ పాలన అంతం కావడంతో అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ  తొలగిపోయాయి. అమరావతే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా తలెత్తుకుని ఠీవీగా నిలిచింది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం ఇక ఏ అవరోధాలూ లేకుండా సజావుగా సాగి నిర్దుష్ట సమయానికి పూర్తి అవుతుందన్న విశ్వాసం అందరిలోనూ వ్యక్తం అవుతోంది. రాజధాని అమరావతి కోసం స్వచ్ఛందంగా భూములిచ్చి గత ఐదోళ్లుగా అన్ని రకాలుగానూ క్షేభను అనుభవించిన రైతుల  తమ కష్టాలు కడతేరిపోయాయన్న ఆనందంలో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తన ప్రాధాన్యతలు పోలవరం, అమరావతి అని తన తొలి పర్యటనలకు వాటితోనే శ్రీకారం చుట్టడంతో తేటతెల్లం చేశారు. 
అయితే జగన్ ఐదేళ్ల అధికారంలో అమరావతిని నిర్వీర్యం చేయడంతో రాజధాని ప్రాంతం అంతా ముళ్ల కంపలు, చెట్లతో ఒక అడవిలా మారిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టగానే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ ఆరంభించి పూర్తి చేసింది.

జగన్ మూడు రాజధానుల డ్రామా కారణంగా అమరావతిపై కోర్టుల్లో విచారణ దశల్లో ఉన్న కేసుల ఉపసంహరణ దిశగా చంద్రబాబు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.  చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతే అని విస్పష్టంగా  ప్రకటించడంతోనే  వివాదాలన్నీ సమసిపోయినట్లైంది. అమరావతిపై వివిధ కోర్టుల్లో విచారణ దశలో ఉన్న దాదాపు 100 కు పైగా కేసుల ఉపసంహరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వీటిలో  రైతులు వేసిన కేసుల ఉపసంహరణకు వారు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా  ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేయడంపై రైతులు వేసిన కేసును  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చంద్రబాబు మాస్టర్ ప్లాన్‌ ప్రకారమే రాజధాని నిర్మాణం అని ప్రకటించడంతో ఆ కేసు ఉపసంహరణకు రైతులు నిర్ణయం తీసుకున్నారు.

గత ఐదేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంలో మిగిలిన ఆంధ్రప్రదేశ్ ఇక  ఎంత మాత్రం రాజధాని లేని రాష్ట్రం కాదు. ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి కళ్ల ముందు సాక్షాత్కరించబోతోంది. ప్రపంచం చూపు ఇప్పుడు అమరావతిపైనే ఉంది.  కేంద్ర సంస్థలు తరలివస్తున్నాయి. పెట్టుబడులు వెల్లువె త్తుతున్నాయి.  ఇక కేంద్రం నుంచి అమరావతి నిర్మాణం కోసం సంపూర్ణ సహకారం ఉంటుందన్న స్పష్టత వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి పురోగతిపై ఆసక్తి, హర్షం వ్యక్తం అవుతున్నాయి. 

అయినప్పటికీ రాజధాని అమరావతిపై వైసీపీ కుట్రలు ఆగడం లేదు. అసత్య ప్రచారాలతో అమరావతిపై ప్రజలలో అనుమానాలు రేకెత్తించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇటీవల భారీ వర్షాలు, వరదల సమయంలో అమరావతి మునిగిపోయిందంటూ అవాస్తవాల ప్రచారానికి తెరలేపింది. హైకోర్టు మునిగిపోయిందంటూ ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. చంద్రబాబు నివాసాన్ని కాపాడుకోవడానికి బుడమేరు గేట్లెత్తేసి సింగ్ నగర్ ను మంచేశారంటూ అభూత కల్పనలనుర ప్రచారం చేసింది.  హైకోర్టు, సచివాలయం పూర్తిగా మునిగిపోయాయనీ వైసీపీ సోషల్ మీడియా గగ్గోలు పెట్టేసింది.  అయితే వాస్తవాలు కళ్లకు కడుతుండటంతో వైసీపీ ఫేక్ ప్రచారాలను ఎవరూ నమ్మలేదు.  అన్ని అవాంతరాలు, కుట్రలు, కుతంత్రాలను తట్టుకుని అమరావతి ఠీవీగా నిలబడింది. ఇక ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ పూర్తి కావడం, ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు విడుదల కావడంతో అమరావతి నిర్మాణం పరుగులు పెట్టనుంది. 

By
en-us Political News

  
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.