జంగిల్ రాజ్ పోయింది.. జంగిల్ క్లియరెన్స్ మొదలైంది!

Publish Date:Aug 8, 2024

Advertisement

జగన్ పాలనలో గత ఐదేళ్లుగా మూలన పడిన అమరావతి రాజధాని పనులు ఒక కొలిక్కి వస్తున్నాయి. రాజధాని ప్రాంతం మొత్తం అడవిని తలపించేలా మారడంతో ఏయే స్థలాలు ఎక్కడ ఉన్నాయో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక రాజధాని నిర్మాణ పనులు జోరందుకుంటాయని జనం భావించారు. అందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు   రాజధాని అమరావతి  నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి తీవ్రస్థా యిలో కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ముందుగా జంగిల్ క్లియరెన్స్ చేయాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

దీంతో  బుధవారం (ఆగస్టు 7) నుంచీ జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం అయ్యాయి. రాజధాని అమరావతి కేంద్రంగా అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతిలో నిర్మాణాల పైన ఐఐటీ నిపుణులు అధ్యయనం చేశారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం భవిష్యత్ నిర్ణయాలు తీసుకోనుంది. ఇదే సమయంలో రాజధాని అమ‌రావ‌తిలో జంగిల్ క్లియ‌రెన్స్ ప‌నులు ప్రారంభమయ్యాయి.  మంత్రి  నారాయణ పూజ చేసి మరీ జంగిల్ క్లియరెన్స్ పనులను స్వయంగా ప్రారంభించారు.  దీంతో వాటిని శుభ్రం చేసే ప‌నులు  మొదలయ్యాయి. మొత్తం 58 వేల ఎక‌రాల్లో ఉన్న తుమ్మ చెట్లు, ముళ్ల కంప‌ల‌ను నెల‌రోజుల్లోగా తొల‌గించేలా ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా భూములు కేటాయించిన వారికి త‌మ స్థలంపై అవ‌గాహ‌న వ‌స్తుంది.  రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ నిర్మాణాలు జరిపే చోట, ఇన్‌ఫ్రా జోన్లు, ట్రంక్‌ ఇన్‌ఫ్రా ప్రాంతాల్లో దట్టంగా అడవిలా పెరిగిపోయిన చెట్లను, ముళ్ల కంపలను తొలగించనున్నారు.

అయిదేళ్ల కాలంగా అమరావతిలో ఎలాంటి పనులు చేపట్టకపోవటంతో ఈ పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం అమరావతిలో పిచ్చి చెట్లు, కంపలు పెరిగిపోయి కనీసం వేసిన సీసీ రోడ్లు కూడా కనిపించే పరిస్థితి లేదు.  ఇందు కోసం ప్రభుత్వం భారీగానే ఖర్చు చేయాల్సి ఉంది. వీటిని తొలగించటానికి సీఆర్‌డీఏ అధికారులు రూ.36.50 కోట్లతో టెండర్లు పిలవాల్సి వచ్చింది.  ఆ టెండర్లు ఇటీవలే ఖరారు చేశారు. ఎన్‌సీసీఎల్‌ సంస్థ ఈ టెండర్లను దక్కించుకుంది. బుధవారం (ఆగస్టు 7)  ఉదయం నుంచి ఎన్‌సీసీఎల్‌ సంస్థ పిచ్చి, తుమ్మ చెట్ల తొలగింపు పనులు చేపట్టింది. వెలగపూడి సచివాలయం వెనుక వైపున ఎన్‌ 9 రోడ్డు నుంచి ఈ పనులను ప్రారంభించారు. ఈ పనులపై మంత్రి నారాయణ  సీఆర్‌డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాదారు.

జంగిల్‌ క్లియరెన్స్ యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామన్నారు, రాజధాని క్యాపిటల్‌  రీజియన్ పరిధిలోని మొత్తం 99 డివిజన్లలో ఒకేసారి పనులు మొదలుపెట్టనున్నట్టు చెప్పారు. నెల రోజుల్లో జంగిల్‌ క్లియరెన్స్‌ పూర్తి చేస్తామన్నారు. నెల రోజుల్లో ఈ పనులు పూర్తయిన తరువాత ఐఐటీ టీం ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రస్తుతం నిలిచిన నిర్మాణాలు..కొత్త వాటి పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇదంతా పూర్తయ్యాక వర్షాకాలం ముగిశాక రాజధాని నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి.

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.