వి.ఐ.పి. లకు అడ్డాగా మారుతున్న ఆళ్ళగడ్డ
Publish Date:May 18, 2012
Advertisement
కడప జిల్లాకు పొరుగునే ఉన్న కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ, ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక గెలిచేది నీవా? నేనా? అన్నట్లు మూడు ప్రధాన ప్రార్తీలు ప్రచారంలో పోటీ పడుతున్నాయి. ప్రత్యేకించి ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో కాంగ్రెస్, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ, ఎమ్మిగనూరులో తెలుగుదేశం, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఓటింగ్ పరంగా మూడు పార్టీల ప్రభావం కనిపించినా రెండు నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ మాత్రం రెండు పార్టీల మధ్యే నడుస్తుందని వారు అంచనా వేస్తున్నారు. ఇప్పటి దాకా పోటీలో అత్యల్ప మెజార్టీలే నమోదైనా వచ్చే ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని అభ్యర్థులు కుతూహలపడుతున్నారు. వీరితోపాటు ఈ రెండు నియోజకవర్గాలపైనా మూడు పార్టీల ప్రధాననేతలు దృష్టిసారించారు. తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబునాయుడు, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహనరెడ్డి ముందుగానే ఓటర్లను కలిసి తమ అభ్యర్థులకు సహకరించాలని ప్రచారం చేశారు. చంద్రబాబు ఇక్కడ విజయం కోసం పట్టుపడు తున్నారన్న ప్రచారం జరగటంతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేత జగన్ ముందస్తు సర్వే నిర్వహించారు. ఆ సర్వే సూచనలను పాటిస్తూ ఆయన ఎమ్మిగనూరులో ఇంటింటికీ నడిచి తిరిగారు. జగన్ ఇలా తిరగటం ఆ పార్టీ నాయకులంతా ఆళ్ళగడ్డలో కార్యకర్తల సమావేశానికి వచ్చారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఉప ఎన్నికల పరిశీలకులు వాయలార్ రవి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు శత్రుచర్ల విజయరామరాజు, టి.జి.వెంకటేష్, ఎంపీలు ఎస్.పి.వై. రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఒక్క రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఒక్కరే రాలేదు. ఇదిలా ఉంటే ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా గంగుల ప్రతాపరెడ్డి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థిగా భూమా శోభానాగిరెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ కూడా ప్రచారానికి ముందుగానే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించటంతో ఫలితాల్లో వీరిద్దరిలో ఒక్కరు విజయం సాధించినట్లు ప్రకటించవచ్చని పరిశీలకులు అంచనా వేశారు. ఏమైనా ఈ ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతాయని వారు భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/allagadda-as-vips-den-24-14126.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





