రోజూ రెండు సార్లు దంతాలు శుభ్రం చేసుకోవాలా? అలా చేయకుంటే ఏం జరుగుతుందంటే!

Publish Date:Mar 22, 2024

Advertisement

 

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని ఓ సామెత ఉంది. అదే విధంగానే నోటి ఆరోగ్యం బాగుంటే శరీరం కూడా చాలా వరకు ఆరోగ్యంగానే ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నోటి ఆరోగ్యం గురించి చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. నోటి దుర్వాసన, పంటి నొప్పి, చిగుర్ల సమస్యలు వంటివి ఎదురైనప్పుడు, పళ్లు చాలా సున్నితంగా మారిపోయినప్పుడు తప్ప చాలామంది దంతవైద్యులను సంప్రదించడం, దంత సంరక్షణ తీసుకోవడం చేయరు.  అయితే నోటి ఆరోగ్యం, దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే  రోజూ రెండుసార్లు పళ్లు తోముకోవాలని అంటున్నారు దంత సంరక్షణ నిపుణులు. ఈ అలవాటు వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటే..

కావిటీస్ ..
 
రోజూ రెండు సార్లు  పళ్ళు తోముకోవడం వల్ల చెడు బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవకాశాలు తగ్గుతాయి. అదేవిధంగా ఆహారం తీసుకున్నప్పుడు  దంతాల మధ్య ఇరుక్కున్న  ఆహారం తాలూకు అవశేషాలు తొలగించడంలో సహాయపడుతుంది. దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారం నమూలాలు చెడు బ్యాక్టీరియాను, ఈ చెడు బ్యాక్టీరియా యాసిడ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది దంతాల ఎనామిల్‌ను క్షీణింపజేస్తుంది. ఇది దంత క్షయానికి కారణమవుతుంది.

చిగుళ్ల వ్యాధి..
 
రెగ్యులర్ గా రోజుకు రెండుసార్లు బ్రషింగ్ చేయడం వల్ల చిగుళ్ళలో మంట,  ఇన్ఫెక్షన్ కలిగించే ఫలకం,  బ్యాక్టీరియాను తొలగించడం సాధ్యమవుతుంది. ఇవి  చిగుళ్ల వ్యాధిని నివారించడంలో సహాయపడతాయి. చిగుళ్ల వ్యాధి చికిత్స చేయకుండా వదిలేస్తే దంతాలకు నష్టం వాటిల్లి  తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది.

ఎలక్ట్రిక్ టూత్ బ్రష్..
 
ఇప్పట్లో చాలామంది  ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌తో బ్రష్ చేస్తుంటారు.  మాన్యువల్ టూత్ బ్రష్‌తో పోల్చితే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు నోటిని పూర్తిగా శుభ్రపరచడంలో మరింత ప్రభావవంతంగా ఉంటాయి.

సాధారణ దంత పరీక్షలు..

రెగ్యులర్ గా రోజుకు రెండు సార్లు  బ్రషింగ్ చేయడం నోటి పరిశుభ్రతను పెంచుతుంది. అలాగే  మొత్తం దంత ఆరోగ్యాన్ని  కాపాడుతుంది. దంతసంరక్షణలో భాగంగా అప్పుడప్పుడు చెకప్ చేయించుకుంటూ ఉంటే దంతాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు అయినా ముందుగానే తెలుసుకుని వాటికి తగిన నివారణా చర్యలు తీసుకోవచ్చు.

దంతాల నష్టం ..

రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం ద్వారా దంతాల మీద ఏర్పడే  ఫలకం,  బ్యాక్టీరియాను క్రమం తప్పకుండా తొలగించడం సాధ్యమవుతుంది. దీనివల్ల  క్షయం లేదా చిగుళ్ల వ్యాధి కారణంగా దంతాలకు కలిగే  నష్టాన్ని నివారించవచ్చు. దంతాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, దంతాలకు కలిగే నష్టాన్ని ముందుగానే తెలుసుకుని నివారించాలన్నా నోటి శుభ్రత, నోటి సంరక్షణ చర్యలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం.

                                                       *నిశ్శబ్ద.

By
en-us Political News

  
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం..
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది...
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు..
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు...
తిండి కలిగితే కండ కలదోయ్ అని అంటుంటారు. అలాగే కొందరు ఎంత కారంగా ఉన్న ఆహారం తింటే.. శరీరం అంత దృఢంగా ఉంటుందని కూడా అంటుంటారు.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బాగా కారంగా...
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (Heart Attack) బారిన పడుతున్నారు. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదమే అయినప్పటికీ, మన శరీరం కొన్ని రోజుల ముందే కొన్ని లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను సరైన సమయంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.
భారతీయుల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది.  పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లేకుండా రోజు అస్సలు గడవదు.  ఇక ఇప్పట్లో చాలా మంది పనీర్ కుడా బాగా వినియోగిస్తున్నారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.