వైసీపీ,జనసేన పార్టీల మధ్య వారధిగా అలీ
Publish Date:Jan 4, 2019
Advertisement
టాలీవుడ్ నుంచి వైసీపీకి పెరుగుతున్న ఆదరణ. ఇప్పటికే ప్రమఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి, కమెడియన్ పృథ్వీలు వైసీపీలో చేరగా...తాజాగా మరో సీనియర్ నటుడు,ప్రముఖ కమెడియన్ అలీ వైసీపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గత నెల 28న ఓ ఎయిర్‌పోర్టులో జగన్, అలీ కలుసుకోవడంతో అప్పటి నుంచి అలీ వైసీపీకి వెళ్తున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వ్యాఖ్యలను నిజం చేస్తూ అలీ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలిపారు. ఈ నెల 9న వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో అదే రోజు వైసీపీలో చేరేందుకు అలీ నిర్ణయించుకున్నారు. అదే విధంగా పార్టీ ఆదేశిస్తే పోటీకి కూడా తాను సిద్దమంటూ అలీ తేల్చిచెప్పారు. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించి అలీ భంగపడ్డారు. ఆ తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. అయితే ఈ సారి ఎన్నికల్లో వైసీపీ అలీకి పోటీ చేసే అవకాశం కల్పిస్తుందా..? లేదా కేవలం ప్రచారానికే పరిమితం చేస్తుందా..? అన్నది సంధిగ్దమే.. కాగా.. పవన్‌కు సన్నిహితుడిగా పేరున్న అలీ.. జనసేనలోకి కాకుండా వైసీపీలోకి చేరుతుండటంపై సినీ, రాజకీయ వర్గాలో చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ తనకు దేవుడితో సమానమన్న బండ్ల గణేష్ కూడా మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరి జనసేన కార్యకర్తలను షాక్‌కు గురిచేశారు. ఇప్పుడు మరోమారు పవన్‌కు ఆప్తుడైన అలీ..పవన్ నిత్యం విమర్శించే జగన్ పార్టీలో చేరబోతున్నారు. ఈ పరిణామాల పట్ల పవన్ అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో ..?..ఇదిలా ఉంటే ఎన్నికల తర్వాత పరిస్థితులను బట్టి వైసీపీ జనసేన పార్టీలు ఒకరికొకకు సహకరించుకోవాల్సి వస్తే వారి మధ్య అలీ వారధిగా పనిచేసే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/actor-ali-to-join-in-ycp-party-39-85143.html





