సేవా పతక గ్రహీతలను సత్కరించిన సీపీ సజ్జనార్‌..!

Publish Date:Aug 14, 2026

Advertisement

 

హైదరాబాద్ పోలీస్‌లకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలు..!

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పోలీస్ సేవా పతకాలకు ఎంపికైన ఇద్దరు హైదరాబాద్ పోలీస్ అధికారులను నగర పోలీస్ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ శుక్రవారం ఘనంగా సత్కరించారు. రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికైన సికింద్రాబాద్‌ జోన్‌ అదనపు డీసీపీ జే. నర్సయ్య, విశిష్ట సేవా పతకానికి ఎంపికైన సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఆర్‌జీ శివమారుతిని సీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అంకితభావం, అత్యుత్తమ నిబద్ధత కనబరిచినందుకే అధికారులకు ఈ అత్యున్నత పురస్కారాలు దక్కాయని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో అదనపు డీసీపీ నర్సయ్య, సైబర్‌ నేరాల నియంత్రణ, సాంకేతిక దర్యాప్తులో ఏసీపీ శివమారుతి కనబరిచిన ప్రతిభ ప్రశంసనీయమన్నారు.

జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక సేవా పతకాలు అందుకోవడం ద్వారా హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ కీర్తిప్రతిష్ఠలను మరింత పెంచారని సీపీ పేర్కొన్నారు. వారి సేవలు ఇతర పోలీస్‌ అధికారులు, సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే అంకితభావంతో ప్రజాసేవలో కొనసాగుతూ మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

అదనపు డీసీపీ జే. నర్సయ్య..!

అదనపు డీసీపీ జే. నర్సయ్య 1991లో ఎస్సైగా పోలీస్‌ శాఖలో చేరారు. 35 ఏళ్లుగా పోలీస్‌ శాఖలో సుదీర్ఘ సేవలందిస్తున్న ఆయన.. పలు కీలక కేసుల దర్యాప్తుతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. విధి నిర్వహణలో ప్రతిభకు గతంలో ‘ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌’ (ఐపీఎం) సహా పలు పతకాలను అందుకున్నారు. తాజాగా రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు.

ఏసీపీ ఆర్‌జీ శివమారుతి..!

సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ ఆర్‌జీ శివమారుతి 1995లో ఎస్సైగా పోలీస్‌ శాఖలో చేరి 31 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. దేశవ్యాప్తంగా సాగుతున్న రూ.127 కోట్ల సైబర్‌ మోసాల నెట్‌వర్క్‌ను ‘ఆపరేషన్‌ ఆక్టోపస్‌’ ద్వారా ఛేదించడంలో కీలకంగా వ్యవహరించి గుర్తింపు పొందారు. సాంకేతిక దర్యాప్తులో కనబరిచిన ప్రతిభకు గాను 2022లో ‘కేంద్ర హోంమంత్రి పతకం’ కూడా అందుకున్నారు. తాజాగా విశిష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. ఇద్దరు అధికారులకు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలు దక్కడంపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

ACP J. Narsaiah awarded Presidents Police Medal, CM Revanth reddy, Telangana police, Hyderabad police, CP Sajjanar, ACP RG Shivamaruthi

By
en-us Political News

  
తిరుమల పవిత్రతపై విమర్శలు..!
అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ జాతీయ జట్టు ఊహించని సంచలనం సృష్టించింది.
బాలీవుడ్ స్టార్ హీరోలు షారూఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌లకు ఊహించని చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి.
పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం నమోదైంది.
వరుస సెలవులు రావడంతో తిరుమలగిరులు భక్తుల జనసందోహంతో కిటకిటలాడుతున్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యే, జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అది ఓ ఆలయం.. అమ్మ వారి సన్నిధి. భక్తులు వచ్చి వెళ్లే పవిత్రమైన ప్రదేశం.
రాష్ట్రంలో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను దేశానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు
వికసిత్ భారత్ సంకల్పంలో ఏపీ భాగస్వామ్యం..!
ఖమ్మం నగరంలో అత్యంత నివ్వెరపరిచే విషాద ఘటన చోటుచేసుకుంది.
విజయవాడలో జాతీయ జెండాను ఆవిష్కరించిన లోకేశ్..!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్మార్ట్ కార్డులు, రేషన్ బియ్యం పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతిలోని రాయపూడి పరేడ్ గ్రౌండ్స్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.