ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు..భారీగా నగదు స్వాధీనం
Publish Date:Jun 16, 2026
Advertisement
హైదరాబాద్‌లో ఏసీబీ మరోసారి భారీ స్థాయిలో సోదాలు నిర్వహించింది. ఈ సారి ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ మల్టీజోన్-2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిపై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో మొత్తం 12 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. నరహరి నివాసం, కార్యాలయంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన ఇళ్లలోనూ తనిఖీలు జరిగాయి. పాతబస్తీ ఛత్రినాక ప్రాంతంలోని ఆయన సోదరుడి నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సోదాల సందర్భంగా నరహరి నివాసంలో భారీ మొత్తంలో నగదు లభ్యమైనట్లు తెలుస్తోంది. దాదాపు 32 లక్షల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పలు బ్యాంకు ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు నిల్వలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వీటితో పాటు స్థిరాస్తులు, భూములు, ఇతర పెట్టుబడులకు సంబంధించిన కీలక పత్రా లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
http://www.teluguone.com/news/content/acb-raids---residence-of-narahari-36-223060.html





