నిరాహార దీక్ష విరమించిన అభిజిత్ దీప్కే..!

Publish Date:Jul 20, 2026

Advertisement

 

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠ భరిత పరిణామాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తన ఆమరణ నిరాహార దీక్షను అధికారికంగా విరమించారు. నీట్ (NEET-UG) పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీల వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ గత 30 రోజులుగా ఈ శాంతియుత నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి. 

ఈ ఉద్యమంలో భాగంగా సుదీర్ఘంగా 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి, ఆరోగ్యం క్షీణించడంతో సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సామాజిక విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ విజ్ఞప్తి మేరకు అభిజిత్ దీప్కే తన నిరహార దీక్షను ముగించారు. వాంగ్‌చుక్ భార్య గీతాంజలి అంగ్మో నిరసన వేదికపై నుంచి ఈ సందేశాన్ని ప్రకటించగా, అభిజిత్ నిమ్మరసం తాగి దీక్షను విరమించారు. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిరసనకారులకు మరింత శక్తి అవసరమని, అందుకే దీక్షను విరమించి ప్రత్యక్ష పోరాటంలోకి దూకాలని వాంగ్‌చుక్ కోరడం గమనార్హం.

దీక్ష విరమణ అనంతరం జంతర్ మంతర్ వద్ద వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిరసనకారులు 'చలో సంసద్' (పార్లమెంట్ మార్చ్) పిలుపునిచ్చారు. ఈ మహా పాదయాత్రలో అభిజిత్ దీప్కేతో పాటు గీతాంజలి అంగ్మో మరియు నీట్ పరీక్ష అక్రమాల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రియా కుమారి తండ్రి కూడా పాల్గొన్నారు. 

దాదాపు 8000 మందికి పైగా విద్యార్థులు, యువత, మద్దతుదారులు ఈ మార్చ్‌లో పాల్గొనేందుకు జంతర్ మంతర్ వద్దకు తరలివచ్చారు. "ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి" అంటూ నిరసనకారులు భారీ ఎత్తున నినాదాలు చేశారు. గత కొన్ని ఏళ్లుగా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీటికి వ్యతిరేకంగా భారత చరిత్రలోనే ఇది అతిపెద్ద నిరసన ప్రదర్శనగా నిలుస్తుందని అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు.

ఈ భారీ నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చి చర్చలకు మొగ్గు చూపింది. సిజెపి (CJP) ముఖ్య ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఈ సమస్యపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డాతో భేటీ అయ్యేందుకు బయలుదేరారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలన్న విద్యార్థుల డిమాండ్లపై స్పష్టత వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని ప్రతినిధులు తేల్చి చెప్పారు. మరోవైపు, ఈ నిరసన మార్చ్ పార్లమెంట్‌కు చేరుకోకుండా ఉండేందుకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. 

జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలను పూర్తిగా ఒక ఇనుప కోటలా మార్చేశారు. దాదాపు 32 కంపెనీల పారామిలట్రీ బలగాలను అంటే సుమారు 2000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. భద్రతా కారణాల దృష్ట్యా 5 ఢిల్లీ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. అదనంగా మరో 1400 మంది పోలీసులను రప్పించి బారికేడ్లను వెల్డింగ్ చేసి నిరసనకారులను అడ్డుకునేందుకు సర్వసన్నద్ధమయ్యారు. అయినప్పటికీ విద్యార్థి లోకం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా శాంతియుతంగా తమ నిరసనను కొనసాగిస్తోంది.

Abhijeet Dipke hunger strike, Jantar Mantar protest Delhi, Sonam Wangchuk fast CJP, Chalo Sansad march NEET, JP Nadda meeting student leaders, Delhi police security deployment

By
en-us Political News

  
పౌర వాణిజ్య నౌకపై జరిగిన ఈ దాడిని ఇండియా ఖండించింది. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి, అంతర్జాతీయ నౌకాయానానికి విఘాతం కలిగిస్తూ పౌర సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఉద్ఘాటించింది.
ఏపీఎస్‌బీసీఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డితో పాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్, రాజ్ కసిరెడ్డిలకు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం వచ్చే నెల 3 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది.
శ్రీకాకుళం జిల్లాలో వెలుగులోకి వచ్చిన  4 కోట్ల రూపాయల విలువైన   భూమిని అక్రమంగా కాజేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై కేసు నమోదు కావడంతో..  అరెస్టు ఖాయమని నిర్ధారించుకున్న తమ్మినేని సీతారాం తన కుటుంబంతో సహా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు.  
ఈ గ్లోబల్ మిషన్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 108 దేశాలకు చెందిన 12 వేల మందికి పైగా విద్యార్థినులకు అంతరిక్ష సాంకేతికత, ఉపగ్రహ ఇంజనీరింగ్, విజ్ఞాన శాస్త్రాలపై ఆన్‌లైన్ ద్వారా ప్రాథమిక శిక్షణ అందించారు. ఈ శిక్షణ అనంతరం నిర్వహించిన పరీక్షలు, ప్రాజెక్ట్ మూల్యాంకన ఆధారంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 300 మంది బాలికలను తదుపరి దశకు ఎంపిక చేశారు. ఆ తర్వాత చోటుచేసుకున్న తుది ఎంపిక ప్రక్రియలో ఇండియా నుంచి 20 మంది విద్యార్థినులు స్థానం సంపాదించగా, వారిలో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి జెస్సీ నిలవడం గర్వకారణం.
సీఐబీటీలో చదివిన ఉదయ్ రుద్రరాజు ఓపెన్ ఏఐ కంప్యూట్ విభాగానికి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీటీవోగా నియమితులయ్యారు ఒక సాధారణ ప్రాంతీయ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగిన తెలుగు తేజం ప్రస్థానం.. అంకితభావం, నైపుణ్యం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది.
ఈ సందర్భంగా కోర్టు వెలుపల జరుగుతున్న రాజకీయ చర్చలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇది కేవలం ఒక నేరపూరిత ఉదంతం. దీనిని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని పేర్కొంది.
ఈ తీవ్రమైన ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి స్పందిస్తూ, అవన్నీ అసత్యాలని, బేస్‌లెస్ ఆరోపణలని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలతో సదరు మహిళా అధికారిణిపై కేసు పెడతానని మీడియాకు మెసేజ్ పంపారు. అయితే ఈ వార్త జాతీయ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం కావడం, తన ప్రతిష్ఠకు భంగం కలిగిందన్న మానసిక ఆందోళనకు ఆయన గురై.. హైదరాబాద్ మోతీనగర్‌లోని తన బంధువుల ఇంట్లో తీవ్ర డిప్రెషన్‌లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆక్వా కల్చర్, పొగాకు రంగాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని
ప్రధాని మోడీకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెబుతూ వస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వచ్చే నెల మొదటి తేదీన భోగాపురం రానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి వేదికగా జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శ్రీకాకుళం సమీపంలోని చాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 900 చదరపు గజాల ఖాళీ స్థలం కబ్జాలక్ష్యంగా.. ఆ భూమి అసలు యజమానులకు సంబంధం లేకుండా, స్థలాన్ని కబ్జా చేసేందుకు, లేని వ్యక్తులను ఉన్నట్లుగా, ఉన్న వారిని మరణించినట్లుగా చూపిస్తూ బోగస్ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారు. తద్వారా న్యాయబద్ధమైన వారసుల పత్రాలను ఫోర్జరీ చేసి అక్రమంగా యాజమాన్య హక్కులను పొందడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది.
రాష్ట్రంలో మాతా–శిశు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోన్న ప్రభుత్వం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.