ఇవే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయాలు!

Publish Date:Aug 7, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం బుధవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన  జరిగింది. మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చిన విషయాలు, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను  మంత్రి పార్థసారథి మీడియాకి వెల్లడించారు. 

* రెవెన్యూ శాఖలో మూడు నెలలపాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త పాస్ పుస్తకాలు ఇస్తారు.

* రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానాన్ని అమలు చేస్తారు.

* జగన్ బొమ్మ వున్న సర్వే రాళ్ళను  ఏం చేయాలన్న దాని మీద చర్చ జరిగింది. జగన్ పేరు, బొమ్మ తొలగించాలని నిర్ణయించారు.

* భూముల రీ సర్వేని పక్కన పెట్టాలని నిర్ణయించారు.

* ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు వుంటే స్థానిక ఎన్నికలలో పోటీకి అనర్హులనే నిబంధనను ఎత్తివేయనున్నారు.

* మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పొడిగించారు.

* వైసీపీ ప్రభుత్వం, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అవలంబించిన మద్యం విధానంపై  చర్చ జరిగింది.

* ఎక్సయిజ్ శాఖలో అక్రమాలు జరగకుండా ఏం చేయాలన్న అంశం మీద చర్చ జరిగింది.

* మత్స్యకారులకు ఇబ్బందికరంగా వున్న జీవో నంబర్ 217ని రద్దు చేయాలని కేబినెట్ తీర్మానించింది.

* నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు అనుగఉంగా విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్లతో నిర్మించిన కొత్త మెడికల్ కాలేజీల్లో గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా మరో 380 పోస్టులు భర్తీ  చేయాలని నిర్ణయం.

* పాడేరు, మార్కాపురం పులివెందుల, ఆదోని, మదనపల్లెలో నిర్మించిన మెడికల్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 100 సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభానికి ఆమోదం.

* సున్నిపెంట గ్రామ పంచాయితీకి 280 ఎకరాల భూమిని కేటాయిస్తూ జారీ చేసిన జీఓ నంబర్ 40ని రద్దు చేస్తూ, ఆ భూమిని తిరిగి జలవనరుల శాఖకు అప్పగించాలని నిర్ణయించారు. 

* రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తక్కువగా వుందన్న విషయం మీద చర్చ జరిగింది. రాష్ట్రంలో భవిష్యత్తులో యువతరం తగ్గిపోతుందన్నఆందోళన వ్యక్తమైంది.

* ఎక్సయిజ్ శాఖలో మెరుగైన విధానాలు ప్రవేశపెట్టడంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయాలని నిర్ణయించారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.