Publish Date:Jun 18, 2022
పుస్తకాలు చదివే అలవాటున్నవాళ్లు వాళ్లకు నచ్చిన పుస్తకాన్ని లైబ్రరీ నుంచి ఇంటికి తీసుకువెళ్లి చదివి వెంటనే తిరిగి ఇచ్చేస్తుంటారు. మహా అయితే అప్పుడప్పుడు ఒకటి రెండురోజులు ఆలస్యం జరగవచ్చు. వేరే పనిలో పడి మర్చిపోయానని సదరు పాఠకుడు ఆనక చెప్ప వచ్చు. కానీ కెనడా వాంకోవర్ లైబ్రరీ విషయంలో గొప్ప వింతే జరిగింది. ఒక పుస్తకం ఏకంగా 51 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చింది, అదీ సారీ మరోలా అనుకోవద్దన్న చిన్న లెటర్‌తో పాటు!
మన వూళ్లలా కాదు అక్కడ పుస్తకం ఇవ్వడంలో ఆలస్యం చేస్తే పుస్తకం అద్దతో పాటు అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. కానీ ఈ మహాశయుడు ఎవరోగానీ, ఆ అదనపు ఛార్జీలను తప్పించుకోవడానికి లైబ్రరీ వారికి ఒక వుత్తరం పెట్టా డు. ఇన్నాళ్ల జాప్యం వూహించనిదని, తనను క్షమించమని ఆ లేఖ సారాంశం! చిత్రంగా వుంది గదూ! ఈ వుత్తరం చదివిన తర్వాత ఆ లైబ్రరీ వారు హాయిగా నవ్వుకున్నారు. పోయిందేమో అనుకున్న పుస్తకం చక్కగా తిరిగి వచ్చినందుకు!
ఇక ఆ పాఠకుడు మంచి మనసుతో తన తప్పు తెలుసుకుని మరీ క్షమించాలని కోరడంతో అదనపు ఛార్జీలు వసూలు మాట వదిలేసేరు! వాంకోవర్ లైబ్రరీ వారు తమ ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్లో ఒక బొమ్మను పెట్టారు. 51 ఏళ్ల తర్వాత లైబ్రరీకి ఎంతో భద్రం గా తిరిగి వచ్చిన పుస్తకం అని! హెన్రీ ఎడ్వర్డ్ నీల్ అనే ఆయన రాసిన ది టెలిస్కోప్ అనే పుస్తకం అది. పుస్తకం మీద చివరిగా చదువరికి ఇచ్చిన తేదీ 1971 ఏప్రిల్ 20 అని స్టాంప్ కూడా వేసి వుంది. బొమ్మలో స్టాంప్ పైన 5 సెంట్లు చెల్లించవలసి వుంది అని పేర్కొన్నారు. కానీ ఈ అదనపు ఛార్జీలు లైబ్రరీ తొలగించేసి చాలా కాలమయింది కూడా!
ఇన్‌స్టా గ్రామ్‌లో ఈ పుస్తకం బొమ్మను చూసిన నెటిజన్లు ఎంతో ఆశ్చర్యపోతూ కామెంట్లు పెట్టారు. ఈ ఫోటో ద్వారా తమకు అసలీ లైబ్రరీ సౌత్ హిల్ లైబ్రరీ 51 సంవత్సరాల పాతది అని తెలిసిందని! నిజమేనా? అనీ అడుగుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/a-book-was-returned-to-libraury-after-51-years-25-137909.html
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.