భూమిపై గురుత్వాకర్షణ లేని 6 ప్రదేశాలు...!

Publish Date:Nov 30, 2020

Advertisement

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుందని మనం చిన్నప్పటి నుండి చదువుకుంటూనే ఉన్నాం. కానీ భూమి తిరుగుతున్నప్పుడు, దానిమీద ఉన్న మనం , ఇతర వస్తువులు ఎందుకు కిందపడట్లేదో ఎప్పుడైనా ఆలోచించామా..? కింద పడిపోక పోవడానికి కారణం గురుత్వాకర్షణ. దీన్ని మొదటిసారిగా ఆర్యభట్ట వివరించాడు. ఈ భూమిపై నిలబడి మనం ఏ వస్తువును విసిరివేసిన.. లేదా కిందకు పాడేసిన అది కిందపడి పోతుంది. కానీ కొన్ని ప్లేసుల్లో మాత్రం కిందకు వేసినవి భూమిపైన పడకుండా పైకే వెళతాయి. అలాంటి 6 వింతలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం..

1. రివర్స్ జలపాతం, ఇంగ్లాండ్.

ఈ జలపాతం హేఫీల్డ్ దగ్గర ఉంది. ఈ ప్రదేశంలో నీళ్లు కిందకు ప్రవహించడానికి బదులు పైకే ప్రవహిస్తుంది. దీనికి కారణం గాలి. ఇక్కడ గాలి బలంగా వీస్తుంది. అందుకని దిగువకు ప్రవహించే నీరు గాలి ఒత్తిడి మూలంగా పైకి పైకి నెట్టబడుతుంది. అద్భుతమైన ఈ జలపాతం  78 అడుగుల ఎత్తులో ఉంటుంది.

2. రహస్యాల ఇల్లు, ఒరెగాన్, యు.ఎస్.

ఇక్కడి అడవిలో చిన్న గది లాంటి ఇల్లు ఉంది. ఇదేమి ఒరెగాన్ ఆధ్యాత్మిక సుడిగుండం కాదు. స్థానిక అమెరికన్లు ఈ ప్రాంతాన్ని 'నిషేధిత భూమి'గా వర్ణించారు. ఈ స్థలంలో ఒక రకమైన గోళాకారపు శక్తి కేంద్రం ఉందని వాళ్ళు నమ్ముతారు. అందులో సగం శక్తి కింద అడుగు భాగాన, మరికొంత పై భాగాన కేంద్రీకృతం అయి ఉందని భావిస్తారు. 

ఇక్కడికి వచ్చిన సందర్శకులు వాస్తవికంగా ఆ అనుభూతిని చెందుతారు. ఈ ప్రదేశంలో గురుత్వాకర్షణ ఉండదు. కాబట్టి నడవడం సాధ్యం కాదు. సందర్శకులు సముద్రంలో పడకుండా ఉండాలంటే గోడలను పట్టుకోవాలి. ఆ ఇంట్లో చీపురు ను ఉంచినా కూడా కిందపడకుండా ఎప్పుడూ అది నిటారుగానే ఉంటుంది. ఈ విచిత్రమైన మర్మమైన ప్రదేశంలో బాల్స్ ను ఉంచినా అవి ఉపరితలంపై పైకి వస్తాయి. ఈ మాయా ఘటనల వెనుక ఎటువంటి ట్రిక్స్ లేవు. కేవలం గురుత్వాకర్షణ లేకపోవడమే దీనికి కారణం. 

3.  అరాగట్స్ పర్వతాల కింద ఉన్న రోడ్, ఆర్మేనియా.

ఈ పర్వతం టర్కీ, అర్మేనియా సరిహద్దులో ఉంది. ఈ అద్భుతమైన గురుత్వాకర్షణ నిరోధక దృగ్విషయాన్ని చూసేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది సందర్శకులు ఈ పర్వతాన్ని సందర్శిస్తారు.

ఈ పర్వతం కింద ఎవరైనా కార్ ఇంజన్ ఆపి అక్కడే ఉంచితే దాన్ని డ్రైవ్ చేయకున్నా కూడా పైకి వెళుతుంది. ఆ ప్రదేశాన్ని సందర్శించిన వ్యక్తులు దిగువ వైపు వెళ్లడం కంటే పైవైపు వెళ్లడం చాలా సులభం అని చెబుతారు.

4. హూవర్ డ్యామ్, నెవాడా, యుఎస్.

ఈ ఆనకట్ట ఎత్తు 726.4 అడుగులు. ఎవరైనా కానీ ఈ పొడవైన ఆనకట్టను అధిరోహించాలని అనుకుంటే చిన్న ప్రయోగం చేస్తే చాలు. పెద్దగా చేయవలసిన అవసరం లేదు, బాటిల్లోంచి కొంచెం నీళ్లను కిందుకు పోస్తే అది కింది వైపు ప్రవహించదానికి బదులు పైకి ప్రవహిస్తుంది. ఇది కేవలం ఒక్క నీటి విషయంలోనే కాదు, ఆ ఆనకట్ట నుండి ఏ వస్తువును క్రిందికి విసిరినా ఆ వస్తువు కిందికి పడకుండా పైకి తేలుతుంది. ఇలా వస్తువులు తేలుతూ లేదా నీరు పైకి ప్రవహించటానికి కారణం ఈ ప్రదేశంలో ప్రవహించే బలమైన గాలి.

5. డెవిల్స్ టవర్, వ్యోమింగ్, యుఎస్.

ఈ ప్రదేశం  లాడ్జ్ రేంజర్ జిల్లాలో ఉంది. మట్టిదిబ్బ అద్భుతమైన ఆకారం, పరిమాణం వ్యోమింగ్‌లో చాలా ముఖ్యమైన దృశ్యాన్ని చేస్తుంది. హైకర్లు కూడా ఇష్టపడతారు. కాని కొన్ని కారణాల వల్ల, ఎవరెస్ట్ మౌంట్ ఎక్కిన హైకర్లు కూడా డెవిల్స్ టవర్ శిఖరాన్ని అధిరోహించడంలో విఫలమవుతాడు.

ఇది 1,267 అడుగుల పొడవు మాత్రమే ఉన్నప్పటికీ, దీని వెనుక కారణం అది నిటారుగా ఉన్న గోడలు. ఈ నిటారుగా ఉన్న గోడలు హైకర్లు పైకి చేరుకోవడం అసాధ్యం చేస్తుంది .  తిరిగి రావడం మరింత కష్టతరం చేస్తుంది.

6. దక్షిణ కొరియాలోని మర్మమైన రహదారి.

జెజు ద్వీపంలోని ఈ రహదారిపై ఖాళీగా పడి ఉన్న డబ్బాలు, సీసాలు సాధారణంగా క్రిందికి వెళ్లడానికి బదులుగా పైకి వెళ్తాయి. పర్యాటకులు దీనిని చాలాసార్లు ప్రాక్టికల్ గా ప్రయత్నించి చూశారు కూడా.  దీన్ని గమనించిన అధికారులు ఈ రహదారిని మాగ్నెట్ కలిగిన పర్యాటక ప్రాంతంగా మార్చారు. గురుత్వాకర్షణ క్రమరాహిత్యం ఎక్కడ మొదలవుతుందో చూపించేందుకు అక్కడ సైన్ బోర్డును కూడా పెట్టారు.

By
en-us Political News

  
నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా..
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు...
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా..
ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి? నమ్మకం, అవగాహన, స్వేచ్ఛ ప్రాముఖ్యత ఏమిటి? బ్రేకప్‌ల కారణాలు మరియు పరిష్కారాలపై సి. కళ్యాణ్ చెప్పిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి...
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.