ట్రంప్ బర్త్‌డే.. రూ.500 కోట్లతో కేజ్ ఫైట్

Publish Date:Jun 13, 2026

Advertisement

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్  ట్రంప్ ట్రంప్ 80వ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించడానికి వైట్ హౌస్‌లో భారీ ఏర్పాటు చేస్తున్నారు.  ఈ సందర్భంగా వైట్ హౌస్‌ చరిత్రలోనే తొలిసారిగా అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ (యూఎఫ్‌సీ)  కేజ్ ఫైట్  నిర్వహించనున్నారు.  ఆదివారం (జులై 14) ట్రంప్ జన్మదినం సందర్భంగా నిర్వహించే ఈ ఈవెంట్‌కు 60 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు 500 కోట్ల రూపాయలు  చేయనున్నారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం (జులై 4) పురస్కరించుకుని ఈ ఈవెంట్‌కు యూఎఫ్సీ ఫ్రీడమ్ 250  అని పేరు పెట్టారు. 

ట్రంప్ సన్నిహితుడు యూఎఫ్‌సీ సీఈఓ డానా వైట్  ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరగనుంది .  బోన్లలో నిర్వహించే ఈ పోటీలంటే ట్రంప్‌కు ఎంతో ఇష్టం.  గతంలో చాలాసార్లు ఆయన ఆ పోటీలను వీక్షించారు. ఈ  పోటీలో పలు దేశాలకు చెందిన ప్రముఖ ఫైటర్లు తలపడనున్నారు. యూఎఫ్‌సీ ఫ్రీడమ్ 250 కోంస వైట్ హైస్ ప్రాంగణంలో  ది క్లా  పేరుతో భారీ వేదిక ఏర్పాటు చేశారు.  92 అడుగుల ఎత్తు, 154 అడుగుల వెడల్పు, 600 టన్నుల మెటల్‌తో భారీ స్థాయిలో తాత్కాలిక పైకప్పు నిర్మించారు. వేదిక మధ్యలో యూఎఫ్‌సీ ఫైటింగ్ కేజ్‌తో పాటు,  నలుగే వేల మంది   కూర్చుని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. సామాన్యలు వీక్షించేందుకు వైట్‌హౌస్ బయట భారీ స్క్రీన్‌లు పెట్టారు. అయితే ఈఫిల్ టవర్‌లా ఆ తాత్కాలిక నిర్మాణం శాశ్వతం ఉండిపోతుందని ట్రంప్ అంటున్నారు. 

ట్రంప్ పుట్టిన రోజు పేరుతో వైట్ హౌస్‌లో యూఎఫ్‌సీ పోటీల నిర్వహణపై   విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ స్థలంలో నిబంధనలకు  వ్యతిరేకంగా ప్రైవేటు క్రీడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ  కొందరు కోర్టును ఆశ్రయించారు. అయితే అందులో జోక్యం చేసుకోవడానికి స్థానిక డిస్ట్రిక్ కోర్టు నిరాకరించింది. మరోవైపు ఈ కార్యక్రమాన్ని సమర్ధించుకుంటున్న వైట్‌హౌస్ వర్గాలు, నిర్వహణ ఖర్చంతా యూఎఫ్‌సీనే భరిస్తోందని చెప్తున్నారు.

By
en-us Political News

  
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో శనివారం రాత్రి విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది.
కినాడ జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి దర్యాప్తు పురోగతిపై ఆరా తీశారు. చిన్నారి ఆచూకీని త్వరిత గతిన కనుగొనేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్డీ ఆర్ఎఫ్ సేవలను కూడా వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.
ప్రమాదం తీవ్రత ఎంతగా ఉందంటే.. కారు ఇంటి గోడను ధ్వంసం చేసి మరీ లోపలికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న వారు కారు కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. భారీ శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి వచ్చి చూసేసరికే ఇంట్లో ఉన్న ముగ్గురూ మరణించారు.
నవనీత ముందుగా ఇద్దరు పిల్లలకు ఉరివేసి హత్య చేసి.. అనంతరం తాను కూడా ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. నవనీత ఆత్మహత్య చేసుకోబోయే ముందు తన ఆత్మహత్య కు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ లో రాసింది.
తన పార్లమెంట్ పరిధిలోని ప్రతి పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలంటూ బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలంతా శనివారం (జూన్ 13)తమ తమ పరిధుల్లోని ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రం చేశారు. సొంతంగా చీపురు తెచ్చుకుని, క్లాత్, మగ్గు, బకెట్ తెచ్చుకుని తరగతి గదులను క్లీన్ చేశారు.
ఈ తనిఖీల సమయంలో వారి వద్ద భారతదేశంలో చట్టబద్ధంగా నివసించేం దుకు అవసరమైన పాస్‌ పోర్టులు, వీసాలు, ఇతర గుర్తింపు పత్రాలు లేకపోవడం గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో వీరు అక్రమ మార్గాల్లో భారత్‌లోకి ప్రవేశించి, దేశంలోని పలు ప్రాంతాల్లో కొంతకాలంగా చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు వెల్లడైంది.
తొలి రోజు స్టార్టప్ వెంచర్ కాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం రోజంతా వరుస భేటీలతో బిజీబిజీగా గడుపుతారు. యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాస్ బాచ్ తో విందు సమావేశంలో పాల్గొంటారు. సింగపూర్ సీనియర్ మంత్రి లో యెన్ లింగ్‌తో సమావేశం అవుతారు.
మీ సొంత పెళ్లికైనా లేదా పిల్లల వివాహానికైనా పీఎఫ్ (EPF) అకౌంట్ నుండి డబ్బులు ఎలా విత్‌డ్రా చేసుకోవాలో తెలుసా? 50 శాతం నిధుల ఉపసంహరణకు సంబంధించిన 2026 లేటెస్ట్ నియమాలు, అర్హతలు మరియు సులభమైన ఆన్‌లైన్ ప్రాసెస్ వివరాలు మీ కోసం.
ఒకప్పుడు ప్రపంచాన్ని ఊపేసిన పోకీమాన్ గో గేమ్ డేటాతో ఇప్పుడు మిలిటరీ డ్రోన్లు, ఏఐ రోబోలను తయారు చేస్తున్నారు. ఆటగాళ్లు సేకరించిన 30 బిలియన్ల చిత్రాలతో రూపొందించిన సరికొثة సైనిక సాంకేతికత రహస్యం మీకోసం.
భారతదేశంలో రాబోతున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల లేటెస్ట్ అప్‌డేట్స్, కొత్త రూట్లు, లాంచ్ టైమ్‌లైన్ మరియు రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై చూపించబోయే మైండ్ బ్లోయింగ్ ఇంపాక్ట్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అఫ్గనిస్తాన్‌తో జరిగే మూడో వన్డే కోసం హర్షిత్ రాణా టీమిండియాతో కలవబోతున్నాడు. గాయపడిన హార్దిక్ పాండ్యా స్థానంలో భవిష్యత్తు బ్యాకప్‌గా అతన్ని సిద్ధం చేసేందుకు సెలెక్టర్లు వేసిన మాస్టర్ ప్లాన్ వివరాలు ఇవే.
అల్వాల్ పరిధిలోని టెలికాం కాలనీలో భారీ వర్షం కారణంగా ఓ చెట్టు విరిగి ఇంటి ఎదుట పార్క్ చేసి ఉన్న కారుపై పడింది. కారుపై పడిన చెట్టు కొమ్మలను తొలగించే ప్రయత్నంలో విద్యుత్ తీగలు తగలడంతో తండ్రీ కూతుళ్లు సందీప్, రితిక మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో సందీప్ భార్య శ్వేత గాయపడ్డారు.
విదేశీ పెట్టుబడులైన ఎఫ్‌డీఐ (FDI) మరియు ఎఫ్‌పీఐ (FPI) ల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలు, భారత స్టాక్ మార్కెట్ మరియు ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం గురించిన పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.