Publish Date:Mar 31, 2025
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను వేలం వేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెను వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే. భూముల వేలానికి నిర్ణయం తీసుకున్న సర్కార్ భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆ భూముల చదును కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అక్కడ నుంచి పంపేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు దాదాపు 200 మంది విద్యార్థులను అదుపులోనికి తీసుకున్నారు. దీనిని బీజేపీ, బీఆర్ఎస్ లు కండించాయి. భూముల వేలం వేయాలని రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే బీఆర్ఎస్ కు పట్టిన గతే రేవంత్ సర్కార్ కూ పడుతందని హెచ్చరించారు. హెచ్ యూసీకి ఆనుకుని ఉన్న ఈ భూములను గతంలో అంటే 2004లో అప్పటి ప్రభుత్వం ఈ 400 ఎకరాల భూమిని క్రీడా సౌకర్యాల అభివృద్ధి కోసం న్యూయార్క్ కు చెందిన ఐఎంజీకి (ఇంటర్నేషనల్ మేనేజ్ మెంట్ గ్రూప్) కేటాయించింది. ఈ ప్రాజెక్టు ముందుకు సాగకపోవడంతో 2008లో అప్పటి ప్రభుత్వం ఈ కేటాయింపులను రద్దు చేసింది. దీనిపై ఐఎంజీ, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుప్రీం కోర్టులో సుదీర్ఘ కాలం న్యాయపోరాటం కూడా జరిగింది. ఎట్టకేలకు 2024 ఏప్రిల్ లో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఈ భూమిని వినియోగించుకోవాలని భావించింది.
2024 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వచ్చిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ భూమిని ఉపయోగించుకోవాలని చూస్తోంది. అంతే కాకుండా ఈ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినది ప్రభుత్వం చెబుతోంది.
గత ఏడాది జులైలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ సమ క్షంలో సర్వే కూడా నిర్వహించింది. ఎటువంటి ఇబ్బందులూ లేని కారణంగానే ఈ భూమిని వేలం వేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ భూమిలో సరస్సులు, బఫర్ జోన్ లు లేవనీ స్పష్టం చేసింది. పర్యావరణ పరంగా కీలకమైన రాక్ ఫార్మేషన్లు, సరస్సులను హరిత ప్రదేశాలుగా ప్రకటించి వాటిని పరరక్షించడానికి కట్టుబడి ఉన్నట్లు రేవంత్ సర్కార్ విస్పష్ట హామీ ఇచ్చింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమిని ఆక్రమించే ఉద్దేశం ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదని క్లారిటీ ఇచ్చింది. అదే విధంగా రాతి నిర్మాణాలు, సరస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ నశనం చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐఎంజీ కేటాయింపు రద్దును సుప్రీం కోర్టు సమర్ధించి ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం వెలువరించిన తరువాతనే వీటిని వేలం వేయాలని నిర్ణయించామనీ, విద్యార్థుల మనో భావాలను గాయపరిచే ఏ నిర్ణయం తీసుకోబోమనీ ప్రభుత్వం స్పష్టం చేసిందిి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/400-acers-dispute-39-195312.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.