రెండు ఏళ్ళ బాలుడికి.. 24 /7 పోలీస్ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా..?
Publish Date:Jun 16, 2021
Advertisement
ఇంటి గుట్టు, అల వైకుంఠపురంలో సినిమాలోలాగా.. స్టోరీ మరో చోట రిపీట్ అయింది. కానీ ఇక్కడ సినిమాలో లాగ పిల్లలు మార్చలేదు. ఎత్తుకెళ్లారు. గాంధీనగర్‌లోని అదలాజ్ ప్రాంతంలోని మురికివాడలో చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే దంపతులకు ఏప్రిల్ నెలలో మగబిడ్డ జన్మించాడు. అయితే సడెన్ గా హాస్పిటల్లో ఉన్న పిల్లవాడు కనిపించకుండా పోయాడు.. ఆ బాలుడి వయసు రెండు నెలలు మాత్రమే, ఆ బాబు పుట్టిన రెండురోజులకే ఆసుపత్రి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఇక అంతే పోలీసులు రంగంలోకి దిగారు. అప్పుడు వాళ్ళ ముందు ఉన్న ప్రశ్నలు ఆ పిల్లవాడిని ఎవరు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు. పార్సనల్ రివెంజ్ కోసం చేశారా లేక, లేదంటే కిడ్నాప్ చేసి పసిపిల్లలను అమ్మడానికి ఎత్తుకెళ్లారా అనేది.. కట్ చేస్తే ఆస్పత్రిలోని సీసీ టీవి దృశ్యాల ఆధారంగా వారిని పట్టుకున్నారు. పిల్లలు లేని ఒక జంట బాలుణ్ని కిడ్నాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే రెండు సార్లు కిడ్నాప్ అయిన బాలుడికి ఇక మీదట ఎలాంటి అపాయం జరగకుండా చూసుకుంటామని పోలీసులు ఆ దంపతులకు హామీ ఇచ్చారు. రెండు వారాల్లో నిందితులను పట్టుకుని ఈ చిన్నోడిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ బుడతడు ఈ నెల 5 తేదీన మరోసారి కిడ్నాప్‌కు గురి అయ్యాడు. మళ్ళీ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కేవలం నాలుగు రోజుల్లో కిడ్నాప్‌ను ఛేదించి వీడిని రక్షించారు. పలుసార్లు ఆ బాలుడు కిడ్నప్ అవ్వడంతో చివరికి పోలీసులు చేసేది ఏమి లేక గుడిసె చుట్టు భారీ భద్రత.. 24×7 రక్షణ.. కంటికి రెప్పలా కాపాడుతున్న పోలీసు అధికారులు.. ఇది ఓ పొలిటికల్ లీడర్ బందువు ఇళ్లు కాదు.. అలా అని ఓ నాయకుడి విలవైన ఆస్తి కూడా కాదు. గత కొద్ది రోజులుగా ఇక్కడ పెద్ద స్థాయిలో ప్రొటెక్షన్ పెట్టారు పోలీసులు. చీమ చిటుక్కుమన్నా పోలీసులు అలర్ట్ అవుతున్నారు. ఇది ఎక్కడో కాదు గుజరాత్‌లోని గాంధీనగర్ లో జరిగింది.
http://www.teluguone.com/news/content/2-month-old-boy-gets-round-the-clock-police-protection-in-gandhinagar-adalaj-abduction-bids-in-2-months-39-117737.html





