నీటి బకెట్‌లో పడి 16 నెలల చిన్నారి మృతి

Publish Date:Jun 17, 2026

Advertisement

 

హైదరాబాద్‌ పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో సరదాగా ఆడుకుంటున్న 16 నెలల చిన్నారి క్షణాల్లోనే విషాదానికి గురైంది. ప్రమాదవశాత్తు బాత్రూమ్‌లోని నీటి బకెట్‌లో పడిపోవడంతో ఊపిరాడక మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌బాబా నగర్ సీ-బ్లాక్‌లో మహ్మద్ ఆసిఫ్ ఖాన్, హబీబా ఉన్నీసా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఆయత్ ఖాన్ అనే 16 నెలల కుమార్తె ఉంది.

ఇటీవల కుటుంబ సభ్యులంతా కలిసి బంధువుల ఇంటికి వెళ్లగా, ఈ ఘటన అక్కడే చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం పాపకు స్నానం చేయించిన తల్లి, ఇతర పిల్లలతో ఆడుకోవడానికి వదిలి తన పనుల్లో నిమగ్నమైంది. ఈ సమయంలో అందరి దృష్టి తప్పించుకుని చిన్నారి బాత్రూమ్‌లోకి వెళ్లింది.

కొద్దిసేపటి తర్వాత పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా, నీటితో నిండిన బకెట్‌లో అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించి షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆమెను చంద్రాయణగుట్టలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నాంపల్లిలోని నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించక మంగళవారం చిన్నారి మృతి చెందింది.

ఈ ఘటనపై కంచన్‌బాగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్షణాల నిర్లక్ష్యం ఓ పసిప్రాణాన్ని బలితీసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు నీటితో నిండిన బకెట్లు, టబ్బులు వంటి వాటిని ఎల్లప్పుడూ మూతపెట్టి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. చిన్న జాగ్రత్తే పెద్ద ప్రమాదాన్ని నివారించగలదని హెచ్చరిస్తున్నారు.


 

By
en-us Political News

  
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
హైదరాబాద్‌ మహానగరంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్‌లో శనివారం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
డిజిటల్ విప్లవంలో దూసుకుపోతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధిపై సరికొత్త ముందడుగు వేశారు.
అమెరికాలో ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి.అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో దేశం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. భానుడి ప్రతాపం కారణంగా దేశ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి.
హ్యోసంగ్ భారీ పరిశ్రమ సంఘం అధ్యక్షుడు టకేషి యొకోటా, సియోల్ సెమికండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ టేహ్యుంగ్ లీతో సమావేశమవుతారు. ఇక జులై 7న ఎల్జీ కెమ్ గ్లోబల్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ ఎల్జీ ఓవర్ సీస్ కంపెనీస్ హెడ్ యున్ జు కోహ్ ఎల్జీ టవర్స్‌లో ఏర్పాటుచేసిన విందు సమావేశంలో పాల్గొంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.