137 ఏళ్ల రైల్వే బ్రిడ్జి స్తంభాల్ని రక్షిత కట్టడాలుగా ప్రకటించాలి

Publish Date:Sep 27, 2024

Advertisement

దొరవారి బావి రైల్వే బ్రిడ్జి స్తంభాల్ని కాపాడుకోవాలి

 పురావస్తు పరిశోధకుడు డాక్టర్ఈమని శివనాగిరెడ్డి

ప్రకాశం జిల్లా, గిద్దలూరు-నంద్యాల రైలు మార్గంలో దిగువమిట్టపల్లి- దొరవారిబావి మధ్య గల 137 సంవత్సరాల నాటి రైల్వే బ్రిడ్జి ఆనవాళ్లను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈఓ  డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా, ఆయన, ప్రముఖ చరిత్రకారుడు పరిశోధకుడు విద్వాన్ డాక్టర్ జ్యోతి చంద్రమౌళి, ఔత్సాహిక వారసత్వ కార్యకర్త పాములపాటి శ్రీనాథ్ రెడ్డితో కలిసి శుక్రవారం(సెప్టెంబర్ 27) ఆ బ్రిడ్జిని సందర్శించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 బ్రిటిష్ ప్రభుత్వం గోవా నుంచి మచిలీపట్నానికి సరుకుల రవాణా కోసం రెండు పట్నాల మధ్య మీటర్ గేజ్ నిర్మాణాన్ని తలపెట్టి 1842లో సర్వే చేసి, 1867 నాటికి గోవా-గుంతకల్ మార్గాన్ని పూర్తిచేసి, అదే సంవత్సరం నల్లమల అటవీ ప్రాంతం లో నంద్యాల-గిద్దలూరు మధ్య దిగువమిట్టపల్లి సమీపంలో చలమ-బొగడల మధ్య, 2600 అడుగుల సముద్రమట్టంపై, 800 మీటర్ల పొడవైన రైల్వే బ్రిడ్జిని నిర్మించటానికి బ్రిటన్ లోని బర్నింగ్ హామ్ స్టీల్ ప్లాంట్ నుంచి తెప్పించిన 420 టన్నుల ఇనుము వినియోగించి, స్థానిక కార్మికులతోనే బ్రిటిష్ ఇంజనీర్లు బ్రిడ్జి నిర్మాణానికి పూనుకోవడంతో అభినందించదగ్గ విషయమని శివనాగిరెడ్డి అన్నారు.

 లండన్ తో తయారైన బ్రిడ్జి విడిభాగాలు 1883లో మచిలీపట్నం రేవుకు రాగా, 1884లో న నిర్మాణం ప్రారంభమై, 1887లో పూర్తై దిగువమిట్టపల్లి-దొరవారిబావి మధ్య వంతెనను దాటి, రైలు మచిలీపట్నం నుంచి గోవాకు చేరుకుందని, ఆయన అన్నారు. అదే బ్రిడ్జి పైన 110 సంవత్సరాలు ల పాటు రైళ్లు నడిచాయని, 1992లో ఆ బ్రిడ్జిని ఊడ తీసి, రు.4.00 లక్షలకు పాత ఇనుమును అమ్మారని, 1992 నుంచి, ఈ రైలు మార్గం బ్రాడ్ గేజ్ గా మారిందని వివరించారు.

 137 ఏళ్ల చరిత్ర గల 200 అడుగుల ఎత్తున దిగువమిట్టపల్లి వద్ద గల రాతితో కట్టిన రైలు బ్రిడ్జి స్తంభాలను, దొరవారిబావి వద్ద ఇప్పటికే చెక్కుచెదరని ఇటుక రాతి బ్రిడ్జి గోడల్ని రక్షిత కట్టడాలుగా ప్రకటించి, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధిపరిచి, అలనాటి కష్టతరమైన నిర్మాణ నైపుణ్యాన్ని ఈతరానికి, నల్లమల లో ప్రకృతి అందాల నడుమ తిలకించేటట్లు చేయాలని తరానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, జ్యోతి చంద్రమౌళి, పాములపాటి శ్రీనాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

By
en-us Political News

  
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.