12 పెళ్లిళ్ల నిత్య పెళ్లి కూతురు అంటూ ఫిర్యాదు.. నిరూపించమంటూ నీలిమ సవాల్!

Publish Date:Jun 24, 2025

Advertisement

ఎప్పుడో ముత్యాల ముగ్గు సినిమాలో  నిత్యపెళ్లి కొడుకు క్యారెక్టర్ ను చూశాం. డబ్బు కోసం పెళ్లిళ్లు చేసుకుంటూ పోయే అలాంటి నిత్యపెళ్లికొడుకులకు సంబంధించి వార్తలు మీడియాలో విన్నాం. కన్నాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది నిత్య పెళ్లికూతురి గురించి.  కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువతి ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా డజను పెళ్లిళ్లు చేసుకుంది. జిల్లా ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  ఈమె అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ విడాకులు పొంది, ఆర్థికంగా స్థితిమంతులైన మగవారిని టార్గెట్ చేసుకుని వల విసిరి పెళ్లి చేసుకుంటుంది.  రామచంద్రాపురం గ్రామానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ తన తల్లి వీరలక్ష్మి, రామకృష్ణ, కల్యాణ్ ల సహకారంతో విడాకులు తీసుకుని డిప్రషన్ లో ఉన్న పురుషులను ఎంచుకుంటుంది. ఇక అలా డిప్రషన్ లో ఉన్న వారు ఆర్థికంగా స్థితిమంతులైతే వారిని వదలదు. వారికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకుంటుంది. కొంత కాలం తరువాత.. వారి నుంచి అందినంత సొమ్ము లాగేస్తుంది. ఇదీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో   నిత్య పెళ్లి కూతురు నీలిమపై కొంతమంది బాధితులు సోమవారం (జూన్ 23)  గ్రీవెన్స్ లో జిల్లా ఎస్పీ కార్యాలయంలో చేసిన ఫిర్యాదు. అయితే నీలిమ    తాను అటువంటిది దానిని కాదనీ, తాను  ఎక్కడ 12 పెళ్ళిళ్ళు చేసుకున్నానో నిరూపించాలని   సవాల్ చేస్తోంది. ఇపుడు వాస్తవం ఏమిటో పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది.

  ఆర్థిక స్థోమత ఉండి,   విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్ గా చేసుకుని పెళ్ళి పేరుతో మోసం చేస్తోందంటూ,  నీలిమపై కొంతమంది బాధితులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నీలిమ, ఆమె కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు అయి ఉంది.   నీలిమ కు సహకరిస్తున్న ఆమె తల్లి బేతి వీరలక్ష్మి, మద్దాల శ్రీను, కళ్యాణ్, దుర్గ అనే వ్యక్తులపై ఇప్పటికే పాలకొల్లు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. 

 నీలిమ, ఆమె తల్లి వీరలక్ష్మి, శ్రీను, కళ్యాణ్, దుర్గలు ఒక ముఠా గా ఏర్పడి పెళ్ళిళ్ళ పేరయ్య అవతారం ఎత్తి భార్యా బాధితులను వలలో వేసుకుని మోసానికి పాల్పడుతున్నట్లు నీలిమపై బాధితులు ఫిర్యాదు చేశారు.  ఈ వార్త మీడియాలో రావడంతో నీలిమ కూడా మీడియా ముందుకు వచ్చి తాను 12 పెళ్ళిళ్ళు చేసుకున్నానడం తప్పు అని ఖండించింది. ఈ పెళ్ళిళ్ళను నిరూపించకపోతే దీనిపై తాను ఎంత దూరమైనా వెళతానని నీలిమ హెచ్చరించింది.   మరో ప్రక్క విడాకులు తీసుకుని డిప్రెషన్ లో ఉన్న పురుషులకు మాయ మాటలు చెప్పి నీలిమ వారిని వివాహం చేసుకుని డబ్బు దండుకుని మాయం అవుతోందని బాధితులు వాపోతున్నారు.

ఎవరైనా తిరగబడితే తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు  కు చెందిన బాధితులు జిల్లా ఎస్పీ గ్రీవెన్స్ లో తమకు జరిగిన మోసాన్ని వివరించి, నీలిమ దోచుకున్న డబ్బును తిరిగి ఇప్పించాలని ఫిర్యాదు చేశారు. ఒకరు 50 లక్షలు ఇచ్చి మోసపోగా, మరొకరు 15లక్షలు ఇచ్చి మోసపోయామని  పేర్కొంటున్నారు. దీనిలో ఎవరి ఫిర్యాదు కరెక్ట్ అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

By
en-us Political News

  
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి వైసీపీ 62 పిటిషన్లు వేసింది.!
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ‘అర్నాబ్’ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది.
దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో వైఎస్సార్‌సీపీకి దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
ప్రేమలో పడితే చాలా మంది పిచ్చి పనుల చేస్తుంటారు. నా కోసం ఏం చేస్తావని ప్రియురాలు అడిగితే.. ప్రాణమైనా ఇస్తానని లేదా ఆకాశంలోని చుక్కలైనా తెచ్చిస్తానని సినిమా డైలాగులు చెబుతుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.