ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సలహాదారులు ఎంతమంది? వారికి ఇచ్చే జీతభత్యాల సంగతేంటి? వారంతా ఎవరికి.. ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? అనే అంశాలపై ఏపీలోని సాధారణ ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది. జగన్ రెడ్డి సర్కార్ పదుల సంఖ్యలో సలహాదారులను నియమించుకుంది. ఆ సంఖ్య 70కి పైనే ఉంటుంది.
వారిలో చాలా మందికి మందికి కేబినెట్ ర్యాంకు కూడా ఇచ్చింది. ఆ హోదాలోనే లక్షల్లో జీత భత్యాలు ఇస్తోంది. అంటే సలహాదారులకు అందరికీ కలిసి నెల నెలా కోట్ల రూపాయలు జీత భత్యాల రూపంలో ప్రజాధనాన్ని పందేరం చేస్తోంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కన్నా.. సలహాదారులకే ఎక్కువ జీతం ఇస్తున్నారని అంటున్నారు. సలహాదారుల నియామకంపై ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నా.. న్యాయస్థానం సైతం ఇంత మంది సలహాదారులా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా, విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నా జగన్ సర్కార్ నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా సలహాదారుల నియామకాల విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంత మంది సలహాదారుల నుంచి ఎలాంటి సలహాలు స్వీకరిస్తున్నది ఒక బ్రహ్మ రహస్యం.
అసలే ఆర్థికంగా దిగజారిపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఉద్యోగులకుర నెలనెలా సక్రమంగా జీతాలివ్వలేని దుస్థితిలో ఉన్న రాష్ట్రంలో సలహాదారుల పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం ఏమిటని ఆర్థిక రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇంత మంది సలహాదారులను నియమించుకున్న జగన్ ప్రభుత్వాన్ని హైకోర్టు కడిగి పారేసింది.
సలహాదారుల నియామకంపై దాఖలైన పిటిషన్ గురువారం (జనవరి 5)న హైకోర్టు విచారించింది. ఇలాగే వదిలేస్తే రేపు ఎమ్మార్వోలకు కూడా సలహాదారులను నియమిస్తారేమో అంటే వ్యాఖ్యానింది. ఐఏఎస్ అధికారులు ఉండగా వివిధ శాఖలకు సలహాదారులు ఎందుకని ప్రశ్నించింది. సలహాదారుల నియామక రాజ్యాంగ బద్ధతను తేలుస్తామని స్పష్టం చేసింది. సలహాదారులకు సంబంధించిన పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని ప్రభుత్వాన్నిఆదేశించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-will-clarify-the-legality-of-advisors-appointment-39-149596.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.