తెలంగాణ కోసం మరో కొత్త పార్టీ
Publish Date:Oct 7, 2012
Advertisement
తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్డీ) తెలంగాణ శాఖను ఏర్పాటుచేస్తున్నట్లు ఆర్‌ఎల్డీ అధినేత, కేంద్రమంత్రి అజిత్ సింగ్ ఈరోజు ప్రకటించారు. తెలంగాణ శాఖ కన్వీనర్‌గా కపిలవాయి ఇందిరా దిలీప్‌ను, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహ్మద్ రియాజ్ను నియమించారు. తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమాన్ని నేనెక్కడా చూడలేదు. అని అజిత్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ నేతలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. కాగా అంతకుముందు హైదరాబాద్ చేరుకున్న అజిత్ సింగ్ తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టతరమని అన్నారు. ఆయన ఆర్ఎల్డీ తెలంగాణ శాఖను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ వచ్చారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలతో సమావేశమయ్యారు. అనంతరం అజిత్ సింగ్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వస్తుందని ప్రకటనలు ఏళ్ల తరబడి వింటూనే ఉన్నామన్నారు. తెలంగాణవారంతా ఏకతాటిపై ఉన్నారన్నారు.
http://www.teluguone.com/news/content/-telangana-issue-31-17956.html





