అమెరికా సైనిక స్థావరాలపై నిఘా.. ఇరాన్ కు చైనా సహకారం

Publish Date:Apr 15, 2026

Advertisement

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఒక సంచలన వార్త అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా సైనిక స్థావరాల కదలికలను కనిపెట్టేందుకు ఇరాన్ ఒక రహస్య వ్యూహాన్ని అమలు చేసిందనీ, దీనికి చైనా పూర్తిస్థాయిలో సహకరించిందని  వెల్లడైంది. ఈ మేరకు  ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది.   గతేడాది రహస్యంగా 01బి శాటిలైట్‌ను పొదిన ఇరాన్ దీని ద్వారా సౌదీ అరేబియా, జోర్డాన్, ఇరాక్‌లోని అమెరికా బేస్ లలో కదలికలను ట్రాక్ చేసింది.  చైనా   అనుమతితోనే ఈ ఒప్పందం జరిగిందని నిపుణుల విశ్లేషణ. అయితే ఈ ఆరోపణలను చైనా ఖండించిందనుకోండి అది వేరే సంగతి.  

మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా బలగాల కదలికలను పర్యవేక్షించేందుకు ఇరాన్ ఆధునిక సాంకేతికతను ఆశ్రయించింది. ఇందులో భాగంగా చైనాకు చెందిన ఒక నిఘా ఉపగ్రహాన్ని ఇరాన్ ఉపయోగించిందని ఫైనాన్షియల్  టైమ్స్ కథనం పేర్కొంది. చైనాకు చెందిన  ఎర్త్ ఐ కంపెనీ అభివృద్ధి చేసిన టీఈఈ 01బి శాటిలైట్ ద్వారా ఇరాన్ సక్సెస్ ఫుల్ గా అమెరికా సైనిక స్థావరాలపై నిఘా పెట్టింది.  

సాధారణంగా ఉపగ్రహాలను భూమిపై ఉండగానే విక్రయిస్తుంటారు. కానీ  ఇక్కడ  చైనా కంపెనీ  ఇన్-ఆర్బిట్ డెలివరీ' అనే వినూత్న పద్ధతిని అనుసరించింది. అంటే శాటిలైట్‌ను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించిన తర్వాత..  దాని నియంత్రణను  ఐఆర్జీసీ  ఏరోస్పేస్ విభాగానికి బదిలీ చేసింది. ఈ రహస్య ఒప్పందం ద్వారా ఇరాన్ నేరుగా ఉపగ్రహ డేటాను పొందే వీలు కలిగింది. దీనికి తోడు బీజింగ్‌కు చెందిన  ఎంపోశాట్ అనే సంస్థ గ్రౌండ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను కూడా ఇరాన్ వాడుకునేందుకు వీలు కల్పించింది. ఇక ఇరాన్ టార్గెట్ చేసిన అమెరికా సైనిక స్థావరాలు ఏంటంటే.. 

సౌదీ అరేబియాలో ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌, జోర్డాన్లోని మువాఫక్ సల్తీ ఎయిర్ బేస్, అలాగే.. బహ్రెయిన్ లోనిఅమెరికా 5వ ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్. ఇక పోతే, ఇరాక్  ఎర్బిల్ ఎయిర్‌పోర్ట్, క్యాంప్ బ్యూహ్రింగ్, ఇంకా అలీ అల్ సేలం ఎయిర్ బేస్ వద్ద ఉన్న అమెరికా కార్యకలాపాలను కూడా ఇరాన్ ట్రాక్ చేసింది.  ఈ నిఘా సక్సెస్ కావడం వల్లనే అమెరికాపై ఇరాన్ స్పష్టమైన ఆధిక్యత సాధించగలిగింది. యుద్ధంలో అమెరికా తీవ్రంగా నష్టపోయేలా చేయగలిగింది. ఇక్కడ ఫైనాన్షియల్ టైమ్స్ తన కథనంలో పేర్కొన్నదేంటంటే..  చైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఆ దేశంలోని ఏ ప్రైవేట్ కంపెనీ కూడా ఇలాంటి సున్నితమైన ఉపగ్రహ సమాచారాన్ని ఇరాన్‌కు విక్రయించే సాహసం చేయదు అని.  చైనా వ్యూహాత్మకంగా ఇరాన్‌కు సహకరిస్తూనే, పైకి మాత్రం తమకు సైనిక సంబంధాలు లేవని బుకాయిస్తోందని ఆ కథనం పేర్కొంది.  

ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంటున్న తరుణంలో, చైనా నుంచి అందుకుంటున్న నిఘా సమాచారం పెను ప్రమాదానికి దారితీస్తుందని గల్ఫ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.  చైనా ఇరాన్ క్షిపణుల తయారీకి అవసరమైన విడిభాగాలను  సరఫరా చేస్తోందని అమెరికా గతంలోనే ఆరోపించిన సంగతి విదితమే. ఇప్పుడు శాటిలైట్ సాయం కూడా తోడవడం అగ్రరాజ్యాన్ని ఆందోళనలోకి నెట్టేసింది.  మొత్తానికి, చైనా,ఇరాన్ మధ్య బలపడుతున్న ఈ రహస్య సైనిక సంబంధాలు ప్రపంచ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు బాటలు వేస్తున్నాయని అంతర్జాతీయ రక్షణ నిపుణులు అంటున్నారు.  

By
en-us Political News

  
వర్క్ ప్లేస్ సమానత్వం అన్నది ఒక కంపెనీ సమస్య కాదు, దేశ భవిష్యత్తు ఈ ఆరోపణలు నిర్ధారించని వాంగ్మూలాలు అయినప్పటికీ, వాటిని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు.
నవ్వుతూ ఆపరేషన్ థియోటర్ కువెళ్లిన హారిక మరణించిందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగపోయారు. ఆపరేషన్ వికటించి హారిక మరణించిందని వైద్యులు చెప్పారు.
తంలోలా కాకుండా, ఈసారి ప్రజలకు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) అనే వినూత్న సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. గురువారం నుండి ఈ నెల 30 వరకు ప్రజలు స్వయంగా ఆన్‌లైన్ ద్వారా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
ప్రమాద సమయంలో బోలేరో వాహనంలో మొత్తం 21 మందిఉన్నారు. ఈ ప్రమాదంలో 8 మంది భక్తులు అక్కడిక క్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
14 ఏళ్ల ఇసా అరాస్ మెర్సిన్లీ అనే విద్యార్థి బుధవారం స్కూలుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న ఆయుధంతో రెండు వేర్వేరు తరగతి గదుల్లో అందరూ చూస్తుండగానే కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా పేలిన తూటాలతో విద్యార్థులు భయాందోళనలకు గురై పరుగులు తీశారు.
మట్టి లేకుండానే పంట.. ఇండోర్ సాగులో సరికొత్త రికార్డు సృష్టించిన యువ రైతులు.
రఘురామ కృష్ణరాజు ఆకివీడు రామాలయం అంశంపై బుధవారం హైకోర్టులో స్వయంగా హాజరై వాదనలు వినిపించటం చర్చనీయాంశమైంది.
పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
తెలుగు ఫోక్ సింగర్ మంగ్లీపై ఇటీవల వెలువడుతున్న స్కాం ఆరోపణల నేపథ్యంలో ఆమె పోలీసులను ఆశ్రయించారు.
కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం, ముఖ్యంగా డీప్‌ఫేక్ వీడియోల సృష్టి మరియు వ్యాప్తిపై గుజరాత్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కూట‌మి ప్ర‌భుత్వం కృషితో క్రీడావికాసం సాధ్య‌మ‌వుతోంద‌ని మంత్రి నారా లోకేష్ అన్నారు.
రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయంలో ఉన్న సామాజిక పరిస్థితులు వేరు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు వేరని వారు వాదిస్తున్నారు. కులాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల, అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వారి వాదనలో వ్యక్తమవుతోంది. ఆర్థిక అసమానతల అంశంపై చర్చ తీవ్రమవుతున్న తరుణంలో.. కులం కంటే ఆర్థిక స్థితే ముఖ్యం అనే నినాదం బలంగా వినిపిస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో ఫామ్‌లోకి వచ్చినప్పటికీ, జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.