గ్యాప్ వచ్చిందా.. ఇచ్చారా! బీజేపీకి జనసేన గుడ్ బై?

Publish Date:Jun 19, 2021

Advertisement

ఎప్పటికప్పుడు క్లోజ్ అయినట్లే కనపడతారు.. ఇష్క్ ప్యార్ అంటూ డ్యూయెట్స్ పాడుకుంటారు. అంతలోనే మళ్లీ ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తారు. అవసరమున్నప్పుడు ఆయనని గబ్బర్ సింగ్ అంటారు.. అవసరం లేదనుకుంటే ఫ్లాప్ అయిన గబ్బర్ సింగ్-2 లాగా చూస్తారు. అన్నీ కలిసే చేస్తామంటారు...మళ్లీ ఎవరికి వారు సొంతంగా కథ నడిపించుకుంటారు. ఆయనే మా సీఎం అభ్యర్ధి అంటారు... ఆయనకు తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటారు. వీరిద్దరూ కలిసున్నారో... విడిపోయారో.. ఎప్పుడు కలుస్తారో.. విడిపోతారో అర్ధం కాకుండా.. జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు బిజెపి, జనసేన నేతలు.

తిరుపతి ఉప ఎన్నికల సమయంలో ఎక్కడ లేని ప్రేమాభిమానాలు ఒకరిపై ఒకరు తెగ పారబోసుకున్న బిజెపి, జనసేన నేతలు..ఆ ఎన్నికలయిపోగానే.. ఏదో షూటింగ్ ప్యాకప్ అని చెప్పినట్లే చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కరోనా వచ్చిందని కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు కొత్త సినిమాలు ఫైనల్ చేసే పనిలో ఉన్నారంటున్నారు. మరోవైపు ఆయనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతోంది. కాని రాష్ట్రంలో మాత్రం బిజెపి, జనసేనల మధ్య గ్యాప్ పెరిగినట్లే ఉంది.ఏపీలో ధాన్యం కొనుగోళ్లు జరగటం లేదని.. సరైన గిట్టుబాటు ధర ఇవ్వడం లేదంటూ బిజెపి ఆందోళనలు నిర్వహించింది. కాని ఉమ్మడిగానే ఆందోళనలు నిర్వహించాలనుకున్న రెండు పార్టీల నిర్ణయం ఏమైందో తెలియలేదు. పైగా దీని గురించి కనీసం సమాచారం కూడా జనసేన నేతలకు లేదట. దీంతో జనసేన నేతలు కాస్త గుర్రుగానే ఉన్నారు. దీనిపై ఇరు పార్టీల నేతల మధ్య ఫోన్ లో నే వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది.

మరోవైపు బిజెపి నేతలు మాత్రం పవన్ అందుబాటులో ఉండటం లేదని..కనీసం నాదెండ్ల మనోహర్ కూడా టచ్ లో లేడని..ఎవరికి చెప్పాలని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. తిరుపతి ఉపఎన్నికలో పవన్ ప్రభావం ఏమీ కనిపించలేదని..వచ్చిన ఓట్లే చెబుతున్నాయని..అలాంటి వారిని నమ్ముకుని ఎలా ముందుకు వెళతామని కొందరు బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జనసేన వర్గాలు మాత్రం..వచ్చిన ఓట్లన్నీతమవేనని.. అసలు బిజెపి ఓట్లు ఒక్కటి కూడా లేవని..ముందు అడిగినట్లు తమకే అవకాశం ఇచ్చి ఉంటే..వేరేగా ఉండేదని..వాదిస్తున్నాయి. బిజెపి రాష్ట్ర నేతలు అసలు సమిష్టిగా పని చేయడం లేదని.. ఎవరి ఇంట్రెస్టుకు అనుగుణంగా వారు పని చేస్తున్నారని.. కొందరు వైసీపీకి అనుకూలంగాను.. మరికొందరు టీడీపీకి అనుకూలంగాను ఉంటున్నారని...కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు..నిర్ణయం మేరకు జనసేనతో కలిసి పని చేసేవారు చాలా తక్కువమందే ఉన్నారని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. బిజెపి కేంద్ర నాయకత్వం కలగచేసుకుని..  వారి ఆదేశాలు,నిర్ణయాల మేరకు రాష్ట్ర పార్టీ నేతలు పని చేసేలా చూడాలని జనసేన వర్గాలు కోరుతున్నాయి.

అసలు బిజెపి నేతల వైఖరి నచ్చకనే పవన్ సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారనే టాక్ కూడా వినపడుతుంది. మరోవైపు జనసేనలోని కొంతమంది ఇప్పుడున్న పరిస్ధితుల్లో బిజెపి ఇమేజ్ తగ్గుతుందని..వైసీపీ హవా కూడా తగ్గుతుందని.. రాబోయే కాలంలో టీడీపీ బలపడే ఛాన్స్ ఉందని..అందుకే టీడీపీతో టచ్ లో ఉండాలని వాదిస్తున్నారంట. ఈ తికమక అయోమయానికి చిరాకు పుట్టే పవన్ సినిమాల వైపు బిజీ అయిపోయారనే కామెంట్లు వినపడుతున్నాయి.

By
en-us Political News

  
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.