ఒక్క బిల్డర్ కోసం 4 వేల కుటుంబాలను బలి చేస్తారా? ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్.!

Publish Date:Oct 31, 2026

Advertisement

బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా? అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు నార్సింగి రోడ్డు అలైన్‌మెంట్ వివాదంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన స్కూల్, బిల్డర్‌కు చెందిన హై-రైజ్ భవనాల కోసమే 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చారంటూ ఆరోపించారు.

నార్సింగిలో హరీశ్ రావు పాదయాత్ర.!

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలో 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పుతో నష్టపోతున్న సెవెన్ హిల్స్, వెస్ట్రన్ మెడోస్ తదితర కాలనీల్లో హరీశ్ రావు పర్యటించారు. కాలనీల్లో కాలినడకన తిరుగుతూ హెచ్ఎండీఏ అధికారులు వేసిన రెడ్ మార్కింగ్‌లను పరిశీలించారు. బాధిత కుటుంబాలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అన్ని అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ తమ అపార్ట్‌మెంట్లను కూల్చేందుకు మార్కింగ్‌లు వేశారని కాలనీవాసులు ఆయనకు వివరించారు. దీంతో బాధితులకు అండగా ఉంటామని హరీశ్ రావు హామీ ఇచ్చారు.

ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలా.?

కోకాపేట, నార్సింగి ప్రాంతాల్లో భూముల ధరలు గజానికి రూ.2 లక్షల వరకు పలుకుతుంటే.. సుమారు రూ.110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని గజానికి రూ.47 వేల చొప్పున కేవలం రూ.26 కోట్లకే కేటాయించారని హరీశ్ రావు ఆరోపించారు. ఇప్పుడు ఆ భూమికి హై-రైజ్ భవనాల అనుమతులు ఇచ్చేందుకు సామాన్యుల అపార్ట్‌మెంట్లను కూల్చివేస్తారా? అని ప్రశ్నించారు. జనవరి 7న ఒక జీవో, ఆ మరుసటి రోజు జనవరి 8న మరో గెజిట్ విడుదల చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని నిలదీశారు. బాధితులు తమ వినతులు చెప్పుకోవడానికి కూడా అధికారులు భయపడుతున్నారని విమర్శించారు.


కేసీఆర్ హయాంలో ఇళ్లకు నష్టం లేకుండా చర్యలు: హరీశ్ రావు

గతంలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన హనుమాన్ ఆలయాన్ని కాపాడే క్రమంలో ఏ ఒక్కరి ఇల్లు తొలగించకుండా 2018లో కేసీఆర్ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందని హరీశ్ రావు గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఒక బిల్డర్ ప్రయోజనాల కోసం 10 అపార్ట్‌మెంట్లు, వేలాది మంది కుటుంబాల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని ఆరోపించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు వెళ్లే దారిని కూడా రేకులతో మూసివేశారని, ప్రశ్నించిన వారిని పోలీసులతో బెదిరిస్తున్నారని విమర్శించారు.

బాధితులకు అండగా ఉంటాం.. హెచ్ఎండీఏకు వెళ్తాం.!

గతంలో హైదర్‌షాకోట్‌లో పేదల ఇళ్ల తొలగింపును అడ్డుకున్నామని గుర్తుచేసిన హరీశ్ రావు.. ఇప్పుడు నార్సింగి బాధితుల పక్షాన కూడా బీఆర్ఎస్ పోరాడుతుందని ప్రకటించారు. ఎమ్మెల్యేలందరితో కలిసి బాధిత కుటుంబాలను హెచ్ఎండీఏ కార్యాలయానికి తీసుకెళ్లి అధికారులను కలుస్తామని తెలిపారు.

అర్ధరాత్రి ఫోన్ చేసినా తాను, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి అందుబాటులో ఉంటామని చెప్పారు. బాధితుల భవనాలపై చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 2026లో జారీ చేసినట్లు చెబుతున్న వివాదాస్పద గెజిట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నార్సింగి రోడ్డు అలైన్‌మెంట్ వివాదంపై ప్రభుత్వం, హెచ్ఎండీఏ అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

 

[ Narsingi Road Alignment Harish Rao,  Narsingi Demolition Issue, HMDA, BRS Party, Telangana Politics, Seven Hills Narsingi, Western Meadows, 100 Feet Master Plan Road, Revanth Reddy, Hyderabad Real Estate, Narsingi Residents Protest ]

By
en-us Political News

  
క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని ప్రధాని రేవంత్ తో అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇటీవలి కాలంలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహించిన దాండియా వేడుకలో దురదృష్టవశాత్తు ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అలాగే ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రమోషన్ ఈవెంట్  నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.