సంక్షోభంలో సాక్షి, సిబ్బందికి ఈ నెల జీతాలు అనుమానమే
Publish Date:May 19, 2012
Advertisement
సుమారు వెయ్యికోట్ల బ్యాంకు నిల్వలతో ప్రారంభమైన సాక్షి దినపత్రిక, సాక్షి టెలివిజన్ చానళ్ళు హఠాత్తుగా సంక్షోభంలో పడ్డాయి. సిబిఐ ఆదేశాల మేరకు ఇప్పటికే ఈ రెండు సంస్థలకు చెందిన బ్యాంకు ఎక్కౌంటు లను స్తంభింపజేశారు. దీనితో ఈ సంస్థలు రెండు రోజుల క్రితం కొత్త ఎక్కౌంటు లను ప్రారంభించాయి. అయితే వాటిలో పెద్దగా లావాదేవీలు జరగడంలేదు. ప్రభుత్వం కొత్త ప్రకటనలు ఇవ్వడం ఇప్పటికే మానేసింది. ఇప్పటికే వచ్చిన ప్రకటనులు సంబంధించి సుమారు 50కోట్ల రూపాయల బకాయిలు ఇంకా చెల్లించలేదు. ఇవి ఇప్పట్లో వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇటివలి ఐ ఐ టి పలితాల అనంతరం నారాయణ శ్రీ చైతన్య వంటి సంస్థలు ఈ రెండు సంస్థలకు సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు ఇచ్చాయి. అయితే ఈ డబ్బు సాక్షి సంస్థల ఖర్చులకు ఏ మాత్రం సరిపోదు. సాక్షి దినపత్రికకు ఒక్కోదానికి సగటున 16 రూపాయల ఖర్చు అవుతుంటే మూడు రూపాయలకు మాత్రమే అమ్ముతున్నారు. ముద్రించే వాటిలో సుమారు 20శాతం అమ్ముడుపోవు. సాక్షి టెలివిజన్ ను నిర్వహణకు నేలకు సుమారు మూడుకోట్ల ఖర్చు అవుతోంది. ఆదాయం అందులో సగం కూడా రావడం లేదు. అయితే రిజర్వుఫండ్స్ ఉండడంతో ఇప్పటిదాకా వీటి నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కాని ఎక్కౌంట్స్ నిలిపివేయడం, ఆదాయం లేకపోడంతో వచ్చే నెల సిబ్బందికి ఎలా జీతాలు చెల్లించాల అన్న అంశంపై ఫైనాన్స్ డిపార్టుమెంట్ మల్లగుల్లాలు పడుతుంది. ఇతర మార్గాల ద్వారా డబ్బు వస్తే ఆది ఎలా వచ్చిందో సిబిఐ కు చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల అవసరమైతే జగన్ కుంటుంబ సభ్యులు, సన్నిహితులు నుంచి రుణాలు తీసుకోని సిబ్బంది జీతాలు చేలించాలనే యోచనలో ఫైనాన్స్ డిపార్టుమెంట్ ఉన్నట్లు తెలిసింది. ఈ రెండు సంస్థల ఆస్తులను కూడా ఎటాచ్మెంట్ చేసి ప్రభుత్వం వీటి పర్యవేక్షణకు ఒక అధికారిని నియమించబోతుంది. ఈ అధికారిని నియమించే లోగానే సిబ్బంది జీతాలకు ఏర్పాట్లు చేయాలనీ ఫైనాన్స్ డిపార్టుమెంట్ సిబ్బంది తొందర పడుతున్నట్లు తెలిసింది. సాక్షి పత్రిక, న్యూస్ ఛానల్ సిబ్బందికి ఇతర సంస్తలు ఇస్తున్న దానికన్నా ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నారు. న్యూస్ పేపర్ హకర్లకు కూడా ఎక్కువ కమిషన్ ఇచ్చిన జగన్ ఒక సందర్భంలో జీతభత్యాలు, కమిషన్ల చెల్లింపు విషయంలో సాక్షిని ఆదర్శంగా తెసుకోవలంటూ ఈనాడు అధినేత రామోజీ రావుకు సలహా కూడా ఇచ్చారు.
http://www.teluguone.com/news/content/-jagan-sakshi-24-14159.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





