ఐపీఎల్ అందరికీ లాభాలు పంచితే.. వీరికి మాత్రం పీడకల అయ్యింది!

Publish Date:Mar 27, 2026

Advertisement

ప్రపంచ క్రికెట్ రంగంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్  ఫ్రాంచైజీలకు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఒక్కో ఐపీఎల్ ఫ్రాంఛైజీ విలువ కోట్ల రూపాయలు ఉంది.  రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వంటి జట్లు  15 వేల నుంచి. 16 వేల కోట్ల రూపాయల విలువకు చేరుకున్నాయి. దాదాపు  ఫ్రాంచైజీలన్నిటికీ ఐపీఎల్ అద్భుత ఆదాయాన్ని ఇచ్చింది. అయితే కొందరికి మాత్రం ఐపీఎల్ ప్రాంఛైజీల యజమానులు వివాదాలు, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఐపీఎల్ అంటేనే వారికి ఒక పీడకలలా మారింది. ఐపీఎల్ ఆరంభంలో జట్లను కొనుగోలు చేసిన కొందరు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఆ దురదృష్ట వంతులు ఎవరని చూస్తే మొట్టమొదట గుర్తుకు వచ్చే పేరు విజయ్ మాల్యా.   

. 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును సుమారు రూ. 450 కోట్లకు కొనుగోలు చేసిన మాల్యా.. ప్రస్తుతం పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోయారు. బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. దేశం విడిచి పారిపోయి లండన్ లో ప్రవాస జీవితం గడుపుతున్నాడు.    పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా దేశ ప్రజల దృష్టిలో నిలిచాడు.  

ఇక ఆ తరువాత డక్కన్ క్రానికల్ అధినేత   టి. వెంకట్రామిరెడ్డి. ఆయన అప్పట్లో హైదరాబాద్ ఫ్రాంచైజీని డెక్కన్ చార్జెస్ పేరుతో కొనుగోలు చేశారు.  డెక్కన్ చార్జన్ ఐపీఎల్ రెండో సీజన్ విజేతగా నిలిచింది.  గిల్ క్రిస్ట్, ఆండ్రూ సైమండ్స్ వంటి స్టార్ ప్లేయర్లతో కళకళలాడిన ఆ జట్టు నిర్వహణ లోపాల కారణంగా   కోర్టు వివాదాల్లో చిక్కుకుంది. తరువాత కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఆ జట్టు ఉనికిలోనే లేకుండా పోయింది. టి.వెంకట్రామిరెడ్డి కూడా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. దీంతో ప్రస్తతం హైదరాబాద్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ చేతికి వెళ్లింది అలాగే , రాజస్థాన్ రాయల్స్ మాజీ వాటాదారులు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాకూడా వివాదాల్లో చిక్కుకుని ఫ్రాంచైజీని వదులు కున్నారు. అయితే ఇలా నష్టపోయిన వారంతా వారి వారి స్వయంకృతాపరాధాల వల్లే నష్టపోయారు అని చెప్పాలి. 
ఐపీఎల్ మాత్రం  ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ గా ఎదిగింది.  యాజమాన్యాలు భారీ పెట్టుబడులతో లాభాల బాటలో పయనిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ వేల కోట్ల వ్యాపారం మరింత పుంజుకునే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. క్రికెట్ ఒక మతంగా మారిన ఇండియాలో ఐపీఎల్ కు ఆదరణ దినదిన ప్రవర్థమానంగా పెరుగుతూనే ఉంటుందని చెబుతున్నారు. 

By
en-us Political News

  
ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చే ముడి చమురు రవాణాలో హెర్మూజ్ జలసంధి అత్యంత కీలకం కావడంతో ఇరాన్ నిర్ణయం ప్రపంచదేశాలను షాక్ కు గురి చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ ఇరాన్‌లోని పలు తీర ప్రాంత లక్ష్యాలపై దాడులు ప్రారంభించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ హెర్మూజ్ జలసంధి మూతను ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. పెట్రోల్‌లో 22 శాతం నుండి 30 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం ఉండే సరికొత్త ఇంధన రకాలకు ఈ పన్ను మినహాయింపు లభించనుంది. దీని పరిధిలోకి ఈ22 , ఈ25 , ఈ27, ఈ30 రకాలు వస్తాయి. ఈ నిర్ణయం దేశీయ ఇంధన మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు వేదిక కానుందని పర్యవారణ, ఆర్థిక నిపుణులు అంటున్నారు.
నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఘనంగా జరుపుకున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్, సింగపూర్‌ దేశాల్లో బాలకృష్ణ అభిమానులు బాలయ్య జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
విద్యా రంగంలో అత్యున్నత ప్రమాణాలను కనబరిచినందుకు గాను ఆయనకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గోల్డ్ మెడల్, ప్రొఫెసర్ డీఎల్ నారాయణ మెమోరియల్ పీహెచ్‌డీ గోల్డ్ మెడల్ లభించాయి.
జార్ఖండ్ ముక్తి మోర్చా నేతలు పరిమళ్ నత్వానీ నామినేషన్ పై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నత్వానీ తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, అలాగే వివిధ కంపెనీల్లో కలిగి ఆయన డైరెక్టర్‌షిప్‌ల వంటి కీ విషయాలను సరిగ్గా వెల్లడించలేదనీ కాంగ్రెస్ ఆరోపించింది.
సంక్షేమ పథకాలతో అనర్హులు ఎలా లబ్ధి పొందుతున్నారన్నది వివరిస్తూ.. గృహలక్ష్మి పథకం కింద కొన్నిచోట్ల చనిపోయిన లబ్ధిదారుల పేరుతో ఇప్పటికీ డబ్బులు డ్రా అవుతున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. మరణించిన వారి బ్యాంక్ ఖాతాలకు వేరే మొబైల్ నంబర్లను లింక్ చేసి, భారీగా మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందనీ. ఇలాంటి వ్యవస్థాగత లోపాలను, మోసాలను అరికట్టి నిజమైన పేదలకు న్యాయం చేయడానికే ఈ వెరిఫికేషన్ అని వివరించారు.
ఆ పండ్లను తల్లి ఇందుమతితో పాటు నలుగురు కుమార్తెలు తిన్నారు.ఆదివారం సాయం త్రం నుంచి ఐదుగురికీ వాంతులు, విరేచనాలు ప్రారంభమవడంతో కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 18 కేసులు నమోదవగా, బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే యువతులే అతని మోసానికి ఎక్కువగా బలైనట్లు విచారణలో తేలింది.
భారతదేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీకి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా 12 ఏళ్ల సుదీర్ఘ, అప్రతిహత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని సరికొత్త చరిత్ర లిఖించినందుకు మోదీ నాయకత్వాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.
సమావేశం ప్రారంభానికి ముందే పవన్ కల్యాణ్ ప్రధాని మోడీకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతదేశ రాజకీయ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధానిగా సేవలందిస్తూ సరికొత్త రికార్డు నెలకొల్పినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
బీహార్‌కు చెందిన అనిల్ కుమార్, మీనా దేవి దంపతులు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చి బొల్లారంలోని బీహార్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అనిల్ కుమార్ లేబర్ కాంట్రాక్టర్ పని చేస్తూ సంపాదిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా అనిల్ కుమార్, మీనాదేవి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఏపీ రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అత్యంత ఆధునిక నివాస సముదాయాల నిర్మాణానికి ఏకంగా 1,234.91 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను కేటాయిస్తూ కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది.
రాష్ట్రంలో మహిళల భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు తమిళనాడు వ్యాప్తంగా హైటెక్ డ్రోన్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు. తమిళనాడు చరిత్రలోనే ఇటువంటి ఒక అధునాతన సాంకేతిక నిఘా వ్యవస్థను మహిళా రక్షణ కోసం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.