ఫేక్ ఉద్యోగం.. నకిలీ పే స్లిప్పులు.. బ్యాంకుకు రూ.30 లక్షల టోకరా.!

Publish Date:Nov 11, 2026

Advertisement

ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం ఉన్నట్లు సృష్టించారు.. జీతం రాకపోయినా వేలల్లో జీతం అందుతున్నట్లు నకిలీ పే స్లిప్పులు తయారు చేశారు. ఆధార్, పాన్ కార్డులను సైతం ఫోర్జరీ చేసి బ్యాంకు అధికారులను నమ్మించారు. ఇలా పక్కా స్కెచ్‌తో ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ నుంచి ఏకంగా రూ.30 లక్షల రుణం పొందిన ముఠా బాగోతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సాధారణంగా బ్యాంకు నుంచి వ్యక్తిగత రుణం పొందాలంటే ఉద్యోగం, నెలవారీ ఆదాయం, గుర్తింపు పత్రాలు కీలకం. అయితే ఈ నిబంధనలనే తమ మోసానికి అవకాశంగా మలుచుకున్నారు నిందితులు. సుమిక్రో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీలుగా వ్యవహరిస్తున్న రామావత్ గోపాల్, పులి సురేష్ బాబు ఈ మోసానికి ప్రధాన సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలో గంటల శంకర్ అనే వ్యక్తిని బెంగళూరులోని ప్రముఖ కాప్‌కో టెక్నాలజీస్ సంస్థలో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నట్లు నమ్మించేలా నకిలీ నియామక పత్రాలు, పే స్లిప్పులు సృష్టించారు. అంతేకాకుండా ఫోర్జరీ చేసిన ఆధార్, పాన్ కార్డులను కూడా సిద్ధం చేశారు. ఈ నకిలీ పత్రాలను అసలైనవిగా నమ్మించిన నిందితులు ఐసీఐసీఐ బ్యాంకులో శంకర్ పేరుతో ఏకంగా రూ.30 లక్షల వ్యక్తిగత రుణం పొందినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ వ్యవహారంలో రుణం మంజూరయ్యేందుకు సహకరించినందుకు రామావత్ సురేష్‌కు రూ.6.70 లక్షలు కమీషన్‌గా చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా, శంకర్ పేరు మీద జారీ అయిన క్రెడిట్ కార్డును ఉపయోగించి మరో రూ.3 లక్షల వరకు షాపింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.

అయితే రుణ చెల్లింపుల్లో తేడాలు రావడం, బ్యాంకు అంతర్గత తనిఖీలు చేపట్టడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేపట్టి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. రామావత్ గోపాల్, పులి సురేష్ బాబు, రామావత్ సురేష్, గంటల శంకర్, గంటల శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ముఠా ఇదే తరహాలో మరిన్ని బ్యాంకులను మోసం చేసిందా? నకిలీ పత్రాల తయారీలో ఇంకా ఎవరైనా సహకరించారా? ఈ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉద్యోగం లేకుండానే ఉద్యోగం ఉన్నట్లు.. జీతం లేకుండానే భారీ ఆదాయం వస్తున్నట్లు నమ్మించి బ్యాంకుకే బురిడీ కొట్టించిన ఈ ముఠా వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.

 

ఇది కూడా చదవండి: రాహుల్‌కు ముందే పుట్టిన మగబిడ్డ.. తొలి కాన్పుపై సోనియా భావోద్వేగ జ్ఞాపకాలు.!

 

[ ICICI Bank Fraud, Ibrahimpatnam Crime, Fake Salary Slips, Fake Aadhaar Card, Personal Loan Fraud, Telangana Police ]


 

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.