డైవర్స్ తర్వాత కొత్త బంధం ఆలోచనా? మొదట ఇది తెలుసుకోండి..!
Publish Date:Jul 17, 2025
.webp)
Advertisement
విడాకులు.. అనే మాట అంత సులభమైనది ఏమీ కాదు. జీవితాంతం కలిసుండాలని ఒక వ్యక్తితో కొంత కాలం ఉండి ఆ తరువాత వారి నుండి విడిపోవడం అనేది మానసికంగా చాలా బాధాకరం. ఇలా విడిపోవడం వల్ల ఎప్పుడూ ఒకరిని మిస్ అవుతున్న భావన ఉంటుంది. అలాంటి పరిస్థితిలో పాత సంబంధం వల్ల అయిన గాయాన్ని మాన్పుకోకుండా, దాన్ని మర్చిపోకుండానే కొన్ని కారణాల వల్ల కొత్త వ్యక్తితో మళ్లీ బంధంలోకి వెళ్లడానికి సిద్దపడుతుంటారు. వైవాహిక బంధం జీవితంలో ముఖ్యమైన భాగం. దానిని మొదలుపెట్టినప్పటి నుండి ముగించే వరకు చాలా జాగ్రత్త అవసరం.
జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం నుండి విడిపోయారు అంటే అర్థం అది చెడు సంబంధం అని. ఆ బంధంలో గాయపడిన వారికి ఆ బందం మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఒంటరిగా ఉండటం అంత సులభం కాదు. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒంటరితనాన్ని నివారించడానికి తొందరపడి కొత్తం సంబంధాన్ని ప్రారంభించడం కూడా మంచి ఆలోచన కాదు. కాబట్టి విడిపోయిన తర్వాత మళ్ళీ కొత్త సంబంధంలోకి రావడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడం ముఖ్యం.
విడిపోయిన తర్వాత..
భార్యాభర్తల బంధం చాలా భావోద్వేగమైనది. ఆ బంధంలో ఇద్దరు వ్యక్తులు చాలా ఓపెన్ అవుతారు. దురదృష్ణ వశాత్తు చాలా నిజాయితీగా ఉండి గాయపడిన వ్యక్తులు ఆ బంధం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను అంత తొందరగా మరచిపోలేరు. కానీ కొందరు మాత్రం వాటిని మరచిపోవడానికి మరొక సంబంధాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. ఈ పొరపాటు ఎప్పుడూ చేయవద్దని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. విడిపోవడాన్ని మరచిపోవడానికి ఏర్పడిన సంబంధాలు సాధారణంగా కాలక్రమేణా విషపూరితంగా మారుతాయి.
కోల్పోయిన భావన..
ఎవరితోనైనా అయినా సరే.. చాలా అపురూపమైన సమయాన్నిగడిపి ఆ తర్వాత కారణాల వల్ల విడిపోతే.. వారి మనస్సు నుండి సదరు వ్యక్తులను తొలగించడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ ఒక విషయం.. ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక టాపిక్ లో విడిపోయిన భాగస్వామిని గుర్తు చేసుకుంటూ వారి గురించి మాట్లాడుతూ ఉంటే.. కొత్త సంబంధానికి సిద్దంగా లేనట్టేనని గుర్తించాలి.
ఒంటరితనం..
ఆరోగ్యకరమైన సంబంధం కావాలంటే, ఒంటరిగా ఉండటం, ఒంటరితనాన్ని కూడా ఆనందించడం నేర్చుకునే వరకు కొత్త బంధంలోకి వెళ్లకూడదు. చాలా కాలంగా ఉన్న సంబంధం విడిపోయినప్పుడు తరచుగా తమతో తాము సమయం గడపలేరు. తమను తాము సంతోషంగా ఉంచుకోలేరు. ఇలాంటి వారు సంతోషంగా ఉండటానికి ఏవైనా వెన్నంటి ఉండాల్సి ఉంటుంది.
ఆశిస్తున్నారా?
భార్యాభర్తల సంబందం గురించి సరైన అవగాహన లేకపోయినా, అందులో లోతుగా జరిగే వాటిని అర్థం చేసుకోలేకపోయినా దయచేసి వెంటనే కొత్త సంబంధం కోసం ప్రయత్నించకూడదు. కేవలం సమయం గడపడానికి ఒక సంబంధం నుండి మరొక సంబంధానికి మారడం మంచిది కాదు. ఇలా చేసే వ్యక్తులు తరచుగా నిరాశ, స్వీయ-అపరాధ భావనతో బాధపడుతుంటారు.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/-how-to-start-a-new-relationship-after-divorce-35-202117.html












