Publish Date:Nov 28, 2024
పిల్ ఉద్దేశాలను విస్మరించి రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ దాఖలు చేసిన ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు పి. విజయబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రూ.50 వేలు జరిమానా విధించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారంటూ విజయబాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు స్వీకరించిన సందర్భంలోనే అనుచిత పోస్టులపై చర్యలు తీసుకోకుండా ఎలా ఉంటారంటూ వ్యాఖ్యానించిన కోర్టు.. ఈ రోజు విచారణ సందర్భంగా మరిన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
అసలు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏయే సందర్భాలలో దాఖలు చేయాలో వివరిస్తూ రాజకీయ దురుద్దేశంతో పిల్ దాఖలు చేసిన విజయబాబుకు రూ. 50 వేలు జరిమానా విధించింది. నెల రోజులలోగా ఆ జరిమానాను లీగల్ సర్వీసెస్ అథారిటీలో చెల్లించాలని ఆదేశించింది. ఆ సోమ్మును అంధులు, బధిరుల సంక్షేమం కోసం వినియోగించాలని లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించింది. విజయబాబు పిల్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. విజయబాబు తన పిటిషన్ లో ప్రజాప్రయోజన వ్యాజ్యం ఉద్దేశాలను విస్మరించారని వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలకు కిరాయి మూకలుగా పనిచేస్తూ సోషల్ మీడియాను దుర్వినియోగపరుస్తున్నవారిపై చర్యలు తీసుకోవల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.
సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టే వారు ఖరీదైన ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగిస్తున్నారని పేర్కొన్న కోర్టు, అటువంటి వారి కోసం పిల్ వేయాల్సిన అవసరం ఏమిటని నిలదీసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది సమాజంలో అణగారిన వర్గాలు కోర్టులను ఆశ్రయించేందుకు తగినంత ఆర్థిక స్థోమత లేని వారి కోసం వేయాలని, అటువంటి ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ ఉద్దేశాలతో వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా అభ్యంతరకర భాష వాడుతున్నారని , ఈ వ్యాఖ్యలు సమాజంలో నిజాయితీగా, చట్టబద్ధంగా ఉండేవారిని కించపరిచే విధంగా ఉన్నాయనీ వ్యాఖ్యనించిన హైకోర్టు అటువంటి వారికి మద్దతుగా ప్రజా ప్రయోజనవ్యాజ్యం ఎలా వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాన్ని ఇష్టం వచ్చినట్లు వినియోగించుకోవడాన్ని చట్టం అంగీకరించదని స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమంలో అనుచిత వ్యాఖ్యలు నేరమేనని విస్ఫష్టంగా పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-high-court-serious-on-journalist-vijayababu-pil-25-189154.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.