మహేష్ బాబు ఓపెన్ చేసిన షాపింగ్ మాల్ సీజ్
Publish Date:Oct 5, 2012
Advertisement
ఒక రోజు క్రితం అంగరంగ వైభవంగా ప్రారంభమైన కూకట్ పల్లి సౌతిండియా షాపింగ్ మాల్ అనుకోని విపత్తును ఎదుర్కొంది. భారీ స్థాయి ప్రచారంతో, హీరో మహేశ్ బాబు చేతుల మీదుగా గురువారం ప్రారంభమైన ఈ షాపింగ్ మాల్ ను శుక్రవారం జీహెచ్ ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఏర్పటైందని వారు అంటున్నారు. భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేనందున షాపింగ్ మాల్ను సీజ్ చేసినట్లు తెలిపారు. అట్టహాసంగా ప్రారంభమైన షాపింగ్ మాల్ ఇలా హఠాత్తుగా మూతపడటం విచిత్రమే! ఇప్పటి వరకు మహేష్ బాబు అనేక కార్పొరేట్ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. వాటితో ఒప్పందం కుదుర్చుకునే ముందుకు ఇందుకు సంబంధించిన వ్యవహారాలు చూసుకునే సిబ్బంది అన్ని వివరాలు ఆరా తీసిన తర్వాత, అన్నీ పర్ఫెక్ట్ గా ఉంటనే మహేష్ బాబు ఓకే చెబుతారు. కానీ సౌతిండియా షాపింగ్ మాల్ విషయంలో మహేష్ బాబు యాడ్స్ చూసుకునే సిబ్బంది ఏమరు పాటుతో వ్యవహరించడం వల్లనే ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని, నింబంధనలు పట్టించుకోలేదని తెలిస్తే మహేష్ బాబు ఓపెనింగుకు వచ్చే వారే కాదని పలువరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/-ghmc-officials-seized-south-india-shopping-mall-31-17922.html





