జనసేన గూటికి బొత్స కన్ ఫర్మేనా?

Publish Date:Aug 24, 2026

Advertisement

వైసీపీ  సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అడుగులు ఎటు అన్న విషయంపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చర్చ జోరుగా నడుస్తోంది.  శాసనమండలిలో  వైసీపీ పక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ జనసేన వైపు చూపు సారించారన్న చర్చ జోరందుగుంది.  ఆయన రాజకీయ అడుగులు జనసేన వైపు పడుతున్నాయని వైసీపీలోనే వినిపిస్తున్నది.  ఆయన ఇప్పటికే జనసేన అగ్రనేతతో ఈ విషయంగా చర్చలు జరిపారని గట్టిగా వినిపిస్తోంది. 

ఈ విషయంలో  బొత్స సత్యనారాయణ స్వయంగా స్పందిస్తూ ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను పార్టీ మారుతాన్న ప్రచారం పూర్తిగా ఆధారరహితమని స్పష్టం చేశారు. ఇదంతా మైండ్ గేమ్ లో భాగమని కొట్టి పారేశారు.  బొత్స స్వయంగా ఖండిచినా ఆయన జనసేనకు షిఫ్ట్ అవుతారన్న ప్రచారం ఇసుమంతైనా తగ్గలేదు. రాజకీయ పరిశీలకులు సైతం బొత్సలో జనసేన, వైసీపీల మధ్య ఊగిసలాట కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. స్థానిక ఎన్నికలలో పార్టీ పోటీపై వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్న జనసేనాని.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం  చేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంగా బొత్స జనసేన వైపు మొగ్గు చూపే అవకాశాలను కొట్టి పారేయలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తాజాగా బొత్స ఇటీవలి మౌనాన్ని వీడి మండలిలోనూ, బయటా కూడా తెలుగుదేశం పై, మంత్రి లోకేష్ పై విమర్శలకు పదును పెట్టడం, అదే సమయంలో జనసేన పట్ల ఒకింత మెతక వైఖరిని అవలంబించడం ఇందుకు తార్కానాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద బొత్స రాజకీయ అడుగుల విషయంలో అటు వైసీపీలోనూ, ఇటు జనసేనలోనూ కూడా ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. 

 Botsa Satyanarayana, Janasena Party, YSRCP, AP Politics, Vizianagaram Politics

By
en-us Political News

  
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడమే తమ లక్ష్యమని
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల (ముఖ్యంగా పట్టణ, నగర పాలక సంస్థల) చుట్టూ తిరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది.
అవినాష్ రెడ్డి ఇల్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లపై జరిగిన దాడుల్లో కేవలం 24 లక్షల క్యాష్, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే దొరికాయా? లేక ఈ దాడుల వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసే పెద్ద విషయం ఏమైనా జరగబోతోందా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..!
దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది.  ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది.  ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి.
ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు.
ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి.
యితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.