ఏఎన్ఆర్ ఆరోగ్యపరిస్థితిపై నాగార్జున
Publish Date:Jan 8, 2014
Advertisement
అక్కినేని నాగేశ్వరరావు అస్వస్థతతో బాధపడుతూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లుగా వార్తలు రావడంతో... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కినేని అభిమానులు ఆందోళన చెందారు. ఆ తరువాత ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి, ‘అంతా సవ్యంగానే ఉన్నదని.. అస్వస్థత అంటూ మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లేనని’ ఆయన మనుమడు హీరో సుమంత్ స్వయంగా ట్వీట్ చేయడంతో అభిమానుల్లో టెన్షన్ తగ్గింది. మరోవైపు నాగార్జున కూడా... మీడియాలో వచ్చిన వార్తలు విని కంగారు పడాల్సిన అవసరం లేదని, నాన్నగారు ఆరోగ్యంగా ఉన్నారని, బాగా కోలుకున్నారని, అన్ని విషయాలు బాగా మాట్లాడుతున్నారని, ఇప్పుడే ఆయన్ను కలిసొచ్చానని నాగార్జున వివరణ ఇచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-actor-nageswara-rao-is-fine-32-29121.html
http://www.teluguone.com/news/content/-actor-nageswara-rao-is-fine-32-29121.html





