రైజింగ్ స్టార్ లోకేష్.. ఫార్చ్యూన్ ఇండియా కవర్ పేజీ కథనం.!

Publish Date:Aug 10, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్   ఐటీ, ఎలక్ట్రానిక్స్  విద్యా శాఖ  మంత్రి నారా లోకేష్‌ రైజింగ్ స్టారా? అంటే..  ప్రముఖ జాతీయ వ్యాపార  పత్రిక 'ఫార్చ్యూన్ ఇండియా' ఔననే అంటోంది. ఆ పత్రిక తన ఆగస్టు 2026 సంచిక కవర్ స్టోరీలో మంత్రి లోకేష్ ను ఆంధ్రప్రదేశ్ రైజింగ్ స్టార్ గా అభివర్ణించింది.  యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.  2024 లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ చేపడుతున్న   విధివిధానాలు, తీసుకుంటున్న  నిర్ణయాలు రాష్ట్రంలో నూతన శకానికి నాంది పలుకుతున్నాయని పేర్కొంది.

2024లో ఐటీ, ఎలక్ట్రానిక్స్,  విద్యా శాఖల మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన క్షణం నుంచీ  నారా లోకేష్ రాష్ట్రాన్ని పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. విశాఖపట్నంలో   గూగుల్   ప్రాజెక్టు ఏపీ సాంకేతిక విప్లవానికి ఒక మైలురాయిగా నిలిచింది.  అలాగే..  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, ఆటోమోటివ్ రంగాల్లో విదేశీ, స్వదేశీ దిగ్గజ సంస్థల నుంచి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చేస్తూ పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నారని ఫార్చ్యూన్ ఇండియా కథనం ప్రస్తుతించింది.

విదేశీ పర్యటనల ద్వారా గ్లోబల్ ఇన్వెస్టర్లను కలవడం లోకేష్ కార్యాచరణలో భాగమైంది. ఇటీవలి దక్షిణ కొరియాలో పర్యటనలో లోకేష్,  ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, బ్యాటరీ తయారీ,   ఎలక్ట్రానిక్ రంగాలకు చెందిన అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. కేవలం ఒప్పందాల స్థాయిలోనే కాకుండా, కంపెనీలకు అవసరమైన   అనుమతులు,  మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఆయన తీసుకుంటున్న సత్వర నిర్ణయాలు ఏపీ పారిశ్రామిక రంగ పురోగతికి ఎంతగానో దోహదం చేస్తున్నాయి. 

అదే విధంగా విద్యా రంగంలో కూడా నారా లోకేష్   కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఉపాధ్యాయుల బదలీల్లో పారదర్శకత తీసుకురావడం, మెగా డీఎస్సీ ద్వారా వేల సంఖ్యలో   టీచర్ పోస్టులను భర్తీ చేయడం, పాఠశాలలకు  రేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి చర్యలతో పాఠశాల విద్య నాణ్యతను పెంచే సమగ్ర ప్రణాళిక  అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత  పెంచడంతో పాటు, విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగిన స్కిల్స్  అందించడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా లోకేష్ ముందుకు సాగుతున్నారు. 

గతంలో అంటే 2014, 2019 మధ్య కాలంలో  విద్యాశాఖ  మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో లోకేష్ రాజకీయ అనుభవం, మాట్లాడే తీరు, ప్రజలతో అనుసంధానమయ్యే విధానంపై ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రతిపక్షాల నుంచి వచ్చిన ట్రోలింగ్, రాజకీయ సవాళ్లను దాటుకుంటూ ఆయన తనను తాను మేకోవర్ చేసుకున్నారు. ముఖ్యంగా  యువగళం పాదయాత్ర ద్వారా ఆయన ప్రజలతో మమేకమై.. వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం ఆయన రాజకీయ ప్రయాణంలో  మైలురాయి అనడంలో సందేహం లేదు. ఆ పాదయాత్ర తరువాత లోకేష్ ప్రజా నాయకుడిగా ఎదిగారు. 

ఇప్పుడు అంటే 2024లో రెండో సారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ  లోకేష్ పాలనాపరంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. సాంకేతికతను ఉపయోగిస్తూ పాలనలో వేగం పెంచడం, జెన్ జీ,   యువతతో నేరుగా సంభాషిస్తూ రాజకీయంలోకి వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటి చర్యల ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రకటనల కంటే ఫలితాల ఆధారిత పాలనకే  ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.  

  Fortune India cover page story on Nara Lokesh, Andhra Pradesh Rising Star, AP IT Department, Nara Lokesh investments, Education Minister

By
en-us Political News

  
ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యత..!
అర్బన్ నక్సల్, రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు దిమాగీ నక్సల్అ నే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఐదు డీఎస్సీలు నిర్వహించాల్సిన ఆయన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోయిందో చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకూ ఇప్పుడు వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూ పొంతన లేదన్నారు.
ఈ కొత్త పాలకమండలిలో వివిధ రాష్ట్రాల నుంచి కీలక నాయకులకు చోటు కల్పించారు.  కాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో మొత్తం 13 మంది నాయకులకు అవకాశం దక్కింది. వీరిలో  పురందేశ్వరి ఒకరు. 
వనపర్తి కాంగ్రెస్‌లో టికెట్ వివాదం..నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా..!
ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన మండలిలో ఇరు పార్టీలకు చెందిన నేతలూ.. వ్యక్తిగత దూషణలతో సభలో మాటల యుద్ధానికి దిగారు.  ముఖ్యంగా  మండలిలో విపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య మాటల మంటలు రేగాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు.
సెంబ్లీ ఎన్నికలలో తన జన సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ... ఇటీవల బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ బీజేపీ కంచు కోటను బద్దలు కొట్టి మరీ విజయం సాధించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన కాక్రోచ్ అన్నపదం ఎంతటి సంచలనానికి దారి తీసిందో.. ప్రధాని తన పంద్రగస్టు ప్రసంగంలో ఉపయోచించిన దిమాగీ నక్సల్ పదం కూడా అంతకు మించి సంచలనం సృష్టించింది. 
 ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ..  ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ  సోమవారం ఉత్తర్వులు ారీ చేసింది.  
గత కొంతకాలంగా పార్టీలో తనను ఏ విధంగా పక్కన పెట్టారో  వివరించారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, తన కుమారుడి విద్యాభ్యాసానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన  సమయంలోనే కనీసం ముందస్తు సమాచారం,  షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా  తనను ఆ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు.
వందే మాతరం గేయానికి ఆమె చేసిన అపచారాన్ని 140 కోట్ల మంది భారతీయులు ఆమెను ఎన్నటికీ క్షమించరన్నారు.  వందేమాతరం గేయానికి చేసిన అపచారానికి ఆ  గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయతో పాటు  40 కోట్ల దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.
ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.