గౌతంకుమార్‌కు గేట్లు మూసుకుపోయాయా?

క్యాట్‌ ఆదేశాలు పాటించనందుకు రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వానికి ఐదువేల రూపాయల జరిమానా విధించింది. అంతేకాకుండా రాష్ట్రప్రభుత్వ పిటీషను, డీజిపి దినేష్‌రెడ్డి పిటీషను కొట్టివేసింది. అంతేకాకుండా ప్రసుత్త డీజిపి దినేష్‌రెడ్డిని ఇన్‌ఛార్జిగా కొత్తడీజిపిని నియమించేంత వరకూ కొనసాగాలని స్పష్టంగా ఆదేశించింది. వారం రోజుల్లోపు డీజిపి నియామకకమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అథికారుల జాబితాను యుపిఎస్సీకి అందించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మొత్తం వ్యవహారంలో అనవసరంగా తొందరపడి డీజిపి దినేష్‌రెడ్డి నియామకాన్ని తప్పుపట్టిన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి గౌతంకుమార్‌ రాజీనామా చేశారని సీనియర్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు.


 

గతంలో ఈ వివాదం రాష్ట్రవ్యాప్త సంచలనమైంది. డీజిపి దినేష్‌రెడ్డి కన్నా సీనియర్లు ఉండగా ఆయనకు ప్రభుత్వం అక్రమపద్ధతిలో నియమించిందని సీనియర్‌ ఐఎఎస్‌ అథికారి గౌతం కుమార్‌ కేంద్రట్రిబ్యునల్‌ (క్యాట్‌)ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్‌ దీనిపై విచారణ జరిపి గౌతంకుమార్‌ ఫిర్యాదులో ఉన్న వాస్తవాన్ని గమనించింది. వెంటనే ఆ నియామకం చెల్లదని, కొత్తగా సీనియార్టీ తీయాలని క్యాట్‌ ఆదేశాలు ఇచ్చింది. క్యాట్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ రాష్ట్రప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా క్యాట్‌ను సమర్థించింది. దీంతో డీజిపి దినేష్‌రెడ్డి ఇప్పుడు ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu