జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్

 

 

 

రాష్ట్రంలో ఎన్నికల జోరు మొదలైంది. అసెంబ్లీ, లోక సభ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా, మున్సిపాల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం మొదలైంది. తాజాగా రాష్ట్రంలో స్థానిక సంస్థల సమరానికి తెరలేచింది. జడ్పిటిసి, ఎంపీటీసి ఎన్నికలకు సంబందించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. స్థానిక సంస్థల బ్యాలెట్ పత్రాల ద్వారానే నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు.

 

1. మార్చి17 నుండి 20 వరకు నామినేషన్ల స్వీకరణ
2. మార్చి 21న నామినేషన్ల పరీశీలన
3. మార్చి 24న నామినేషన్ల ఉపసంహరణ
4. ఏప్రిల్ 6న పోలింగ్
5. ఏప్రిల్ 7న అవసరమైన చోట రీపోలింగ్
6. ఏప్రిల్ 8న ఓట్ల లెక్కింపు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu