విజయసాయిరెడ్డికి నాన్ బెయిలబుల్ వారెంట్లు..

 

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న కేసులో విజయసాయిరెడ్డి రెండో నిందితుడన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డిపై సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుపై ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టు విచారణ చేపడుతున్న నేపథ్యంలో  విజయసాయిరెడ్డి మాత్రం కోర్టుకు హాజరవడం లేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు నేటి విచారణ సందర్భంగా ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.

 

విజయసాయిరెడ్డి పరిస్థితిని ముందుగానే గమనించి.. అనారోగ్యం కారణం వల్లనే కోర్టుకు హాజరుకాలేక పోతున్నానని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు మాత్రం ఆ పిటిషన్ ను కొట్టివేసి.. కేసు విచారణకు హాజరుకు మినహా ఇతర కార్యకలాపాల్లో చురుకుగానే పాలుపంచుకుంటున్నారని మండిపడుతూ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లను జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.