జగన్ పంచన చేరబోతున్న జలగం
posted on Mar 26, 2012 11:42AM
మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు జలగం వెంకట్రావు త్వరలోనే వై.ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కొద్దిరోజుల క్రితం ఖమ్మం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన జగన్ ను అనేకమంది వెంకట్రావు అనుచరులు అనుసరించారు. వెంకట్రావు ఆదేశంపైనే వీరంతా జగన్ ను అనుసరించినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో తమ నాయకుడు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం నుంచి పోటీ చేస్తారని వెంకట్రావు అనుచరులు బాహాటంగానే చెబుతున్నారు. గత ఎన్నికలల్లో వెంకట్రావు పార్టీ ఆదేశాలను ధిక్కరించి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేయడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత వెంకట్రావు తిరిగి పార్టీలోకి రావడానికి ప్రయత్నించినప్పటికీ రేణుకా చౌదరి, పొంగులేటి సుధాకర్ మొకాలడ్డినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ లో తనకు స్థానం ఉండదన్న నిర్ణయానికి వచ్చిన వెంకట్రావు జగన్ పంచన చేరాలని యోచిస్తున్నట్లు తెలిసింది.