వంగవీటి రాధాకు జగన్ షాక్..

విజయవాడ నగరంలో కీలకనేత, కాపునేత వంగవీటి రాధాకృష్ణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ షాకిచ్చారు. నిన్నటి దాకా పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న వంగవీటి రాధాను ఆ పదవి నుంచి తప్పిస్తూ వైసీపీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడిగా రాధా కొనసాగుతారు. అదే సమయంలో సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు తనయుడు జక్కంపూడి రాజాను ఆ పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu