వైయస్ బావమరిది రవీంద్రనాథ్ కు కేంద్రం షాక్

మ్మం: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బావమరిది రవీంద్రనాథ్ రెడ్డికి కేంద్రం ఝలక్ ఇచ్చింది. ఖమ్మం జిల్లాలోని ఆయన సంస్థ రవి బెరైటీస్ కంపెనీ మైనింగ్ లీజును గనుల శాఖ సస్పెండ్ చేసింది. ఆ కంపెనీ అధీనంలోని భూమిలో తక్షణం పనులు నిలిపేయాలని కలెక్టర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించకపోవడం, వార్షిక లెక్కలు సమర్పించకపోవడం, షోకాజ్‌లకు స్పందించకపోవడం తదితర కారణాలతో ఈ చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. మైనింగ్ రవాణా అనుమతులను కూడా నిలిపి వేస్తున్నారని సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu