'వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్‌'లో అన్నా ఉద్యమం !

న్యూఢిల్లీ: ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంపై అమెరికా గూఢచార సంస్థ సీఐఏ దృష్టిసారించింది. అంతేకాకుండా, ఈ ఉద్యమానికి భారతదేశంలో రాజకీయ ప్రెషర్ గ్రూప్ అనే పేరును కూడా పెట్టింది.భారత్‌లో అవినీతి నిర్మూలనకు అన్నా హజారే బృందం ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్‌ పేరుతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. దీనిపై దృష్టి సారించిన సీఐఏ భారతదేశంలో రాజకీయ ప్రెషర్ గ్రూప్‌గా గుర్తిస్తూ వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్‌లో పేర్కొంది. ఇప్పటికే ఈ పుస్తకంలో ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్, భజరంగ్‌దళ్, జమాయిత్ ఉల్లేమయె హింద్, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ తదితర సంస్థల పేర్లను సీఐఏ ఇప్పటికే నమోదు చేసివుంది. ఈనెల 20వ తేదీన అన్నా బృందం పేరును అప్‌డేట్ చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu