వివేకా కొత్త భార్య ఎంట్రీ
posted on Apr 21, 2023 5:09PM
వివేకానందరెడ్డి రెండు సార్లు పెళ్లి చేసుకున్న రెండవ భార్య షేక్ షమీమ్ తెరముందుకు వచ్చింది. వివేకా హత్య జరిగిన నాలుగేళ్ల తరువాత షమీమ్ ఎంట్రీ అవినాష్ వర్గానికి కొత్త ఊపును తెచ్చింది. నాలుగేళ్లుగా కడప నగరంలోని ప్రకాష్ నగర్ లో గుట్టు చప్పుడు కాకుండా జీవిస్తున్న షమీమ్ ను హైదరాబాద్ కు తీసుకువచ్చి, సీబీఐ ముందుకు వెళ్లేందుకు శిక్షణ ఎవరిచ్చారో తెలుసుకునేందుకు పెద్ద తెలివితేటలు అవసరం లేదు.
ఆ విషయాలను పక్కన పెడితే.. షమీమ్ సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ లో అనేక ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. తనను తన భర్త వివేకానందరెడ్డితో కలవకుండా సునీత, శివప్రకాశ్ రెడ్డిలు అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. వివేకాతో పెళ్లి తన ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిందన్న షమీమ్ , ఈ వివాహానికి తన అనుమతి లేదని తేల్చేశారు. తన వివాహం 2010లో జరుగగా, 2015లో కొడుకు షెహన్ షా కలిగాడని ఆమె చెబుతోంది. అయితే వివేకాతో జరిగిన తన వివాహానికి ఎటువంటి సాక్ష్యాన్ని ఆమె అందించ లేదు. 2019లో హత్యకు గురైన వివాకా అప్పటికి నాలుగేళ్లు కూడా లేని ఆమె కుమారుడిని తన రాజకీయ వారసుడిగా ప్రకటించారని షమీమ్ చెబుతోంది. భూ సెటిల్మెంట్ లో తనకు ఎనిమిది కోట్లు వస్తాయన్న ఆశతో ఎదురు చూసినట్లు షమీమ్ చెప్పుకుంది.
తనకు డబ్బు, తన కుమారుడికి రాజకీయ వారసత్వం రావాలని షమీమ్ కోరుకుంది. కానీ అలా జరగకపోవడంతో నాలుగేళ్లుగా ఆలోచించి ఇప్పడు సీబీఐ ముందు తన గోడు వెళ్లబోసుకుంది. . నిన్నటి వరకూ వివేకా రాసిన వీలునామా చుట్టూ సాగిన చర్చ ఈ రోజు ఎక్కడా కనిపించలేదు. వేవేకా వీలునామారాశారని వాదించిన అవినాష్ వర్గం ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదు. కడప ప్రకాష్ నగర్ నుండి వచ్చిన షమీమ్ వివేకా హత్యకు సంబంధించి ఏ విషయాన్నీ తన మూడు పేజీల స్టేట్ మెంట్ లో ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో సహజంగానే అవినాష్ వర్గం నిరుత్సాహానికి గురైంది.
మరో వైపు సుప్రీం కోర్టు తాజా ఆదేశాలు ఆ వర్గాన్ని మరింత కలవరపెడుతున్నాయి. షమీమ్ పోరాటానికి, వివేకా హత్య కేసుకు సంబంధం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 25వ తేదీ వరకూఅవినాష్ రెడ్డి అరెస్ట్ పై తెలంగాణ హైకోర్టు స్టే విధించగా, సుప్రీం కోర్టు అంతకు ఒక రోజు ముందే అంటే 24నే ఈ కేసు విచారిణ చేయనుంది. షేక్ షమీమ్ తన వాటా ఆస్తి కోసం, తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం అదే రోజు హైకోర్టు మెట్లు ఎక్కనుంది.
చివరిగా ఒక్క మాట, వైఎస్ రాజశేఖరరెడ్డి తరచుగా తన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి గురించి గొప్పగా మాట్లాడేవారు. తండ్రి రాజారెడ్డి తమ్ముడికి వివేకానందుడి పేరు పెట్టడంతో నిజంగా వివేకానందుడి జీవన విధానాన్ని అనుసరిస్తున్నాడని మురిసిపోయేవారు.. కానీ తాజా ఆరోపణలు దివంగత నేత అంచనాలు తప్పని తేల్చేశాయి.