వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్.. ఈరోజు తేలనుంది!!

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన కూతురు సునీత హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా సీబీఐ మరియు ఏపీ హోం శాఖను చేర్చారు. 

ఇప్పటికే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఇటీవల వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పిటిషన్లు వేశారు. ఇప్పుడు వివేకా కూతురు సునీత కూడా.. ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని పిటిషన్ వేయడంతో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఉన్న పిటిషన్లతోపాటూ... తాజా పిటిషన్‌పైనా ఈరోజు హైకోర్టు విచారించనుంది. కాగా, హైకోర్టు వివేకా హత్య కేసుని  సీబీఐకి అప్పగిస్తుందా లేదా అన్నది ఈరోజు తేలే అవకాశముంది.