జగన్ మందకృష్ణ మద్దతు.. చంద్రబాబు అందుకే మాట్లాడటంలేదు
posted on Oct 9, 2015 11:01AM

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు లో నిరవధిక దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ చేస్తున్న దీక్షకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మద్దతు తెలిపారు. కొత్తగా ఏర్పడిన ఏపీకి రాజధాని ఎంత అవసరమో అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా అవసరమని అన్నారు. ప్రత్యేక హోదా ఏపీలో ఉన్న ఐదు కోట్ల ఏపీ ప్రజల ఆకాంక్ష అని.. దానికోసం పోరాడుతున్న జగన్ కు మద్దతుగా ఉంటామని.. ప్రత్యేక హోదా పై ఏదో ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. అంతేకాదు వైసిపి భవిష్యత్తులో చేపట్టే పోరాటాల్లో భాగస్వాములం అవుతామని చెప్పారు. అంతేకాదు జగన్ చేస్తున్న దీక్షను ఏపీ మంత్రులు, టిడిపి నాయకులు విమర్శిస్తున్నారు వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. అంతేకాదు ఓటుకు నోటు కేసుల్లో ఇరుక్కుపోవడం వల్లే చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటంలేదని అన్నారు.