తలసాని రాజీనాపై నాయిని సంచలన వ్యాఖ్య.. ఆయన ఎప్పడు చేశారు
posted on Oct 9, 2015 10:36AM

తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా పై తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీ నుండి గెలుపొంది ఆపార్టీలో రాజీనామా చేయకుండానే తరువాత టీఆర్ఎస్ పార్టీ మారి మంత్రి పదవి కొనసాగిస్తున్న తలసానిపై పలువురు రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై టీడీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు కూడా ఈ విషయంలో తాము యాక్షన్ తీసుకోవడానికి లేదని.. కాని స్పీక్పర్ ఏదో ఒక చర్య తొందరగా తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా నిన్న తెలంగాణ భవన్ లో నాయిని నర్సింహారెడ్డి, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి జగదీశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా విలేకరులు తలసాని రాజీనామా గురించి, సనత్ నగర్ ఉపఎన్నిక గురించి నాయినిని ప్రశ్నించారు. దీనికి నాయిని సనత్ నగర్ కు ఉపఎన్నిక ఎందుకు తలసాని ఏమైనా రాజీనామా చేశారా అంటూ వ్యాఖ్యానించడంతో ఇప్పుడు అందరికి పెద్ద చర్చాంశనీయంగా మారింది.