కొత్తపల్లి సుబ్బారాయుడు స్థానంలో ఆళ్ల నాని..

 

పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఆళ్లనానిని నియమిస్తున్నట్టు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీ చేరుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆళ్ల నాని ప.గో జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాని నేతృత్వంలో పశ్చిమ గోదావరిలో వైకాపా మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu