నన్ను మోసం చేశాడు బాబోయ్
posted on Sep 30, 2014 4:04PM
.jpg)
హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కి ఓ యువతి వచ్చింది. తనను ఓ యువకుడు మోసం చేశాడు బాబోయ్ అని కంప్లయింట్ చేసి, అతని వివరాలు పోలీసులకు ఇచ్చింది. ఈ కథనం అంతా చదివిన తర్వాత ఎవరు మోసం చేశారు.. ఎవరు మోసపోయారు.. అసలు మోసం అంటే ఏమిటి? మోసం చేయకుండా నీతిగా వుండటం ఏమిటి అనే అంశాన్ని గౌరవనీయులైన పాఠకులే ఆలోచిస్తే వారికే సమాధానం దొరకుతుంది. ఇంతకీ పాయింట్‌లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా మధిరకు చెందిన సదరు యువతి హైదరాబాద్‌లోని వనస్థలిపురంతో భర్త, ముగ్గురు పిల్లలతో నివసిస్తోంది. ఆమెకి ఓ మిస్డ్ కాల్ ద్వారా పంజాగుట్టలో కంప్యూటర్ కోర్సు చేస్తున్న భద్రాచలానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ తరచుగా ఫోన్లో మాట్లాడుకుంటూ వుండేవారు. అలా వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగీ పెరిగీ ఓ ఫైన్ మార్నింగ్ ఆమె తన భర్తని, ముగ్గురు పిల్లల్ని వదిలేసి ఆ యువకుడితో వెళ్ళిపోయింది. ఆమె, ఆ యువకుడు వారంరోజులు మిగతా ప్రపంచాన్ని మరచిపోయారు. వారం తర్వాత అతను ఆమెను ఓ లేడీస్ హాస్టల్లో వదిలి గాయబ్ అయిపోయాడు. దాంతో ఆమెకి అతను తనను మోసం చేశాడన్న విషయం అర్థమైపోయి అర్జెంటుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లయింట్ చేసింది.