యూ ట్యూబ్ స్టంట్.. బాయ్ ఫ్రెండ్ నే కాల్చేసింది..

 

స్మార్ట్ ఫోన్లు వచ్చిన దగ్గర నుండి ప్రజలు ఏం చేస్తున్నారో కూడా తెలియని దుస్థిలో పడిపోయారు. డేటా ప్యాక్ లు, యూ ట్యూబ్ లు, ఫేస్ బుక్ లు ఇలా వీటితోనే జీవనం సాగిపోతుంది. యూట్యూబ్ లో ఎంత ఫేమస్ అయితే అంత పాప్ లారిటీ వస్తుంది. అలా పాపులారిటీ కోసం ప్రాకులాడీ ఆఖరికి ప్రాణాలు కోల్పోయాడు పెడ్రో రూయిజ్ అనే ఓ వ్యక్తి. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం...యూట్యూబ్‌  స్టంట్‌లో భాగంగా త‌న బాయ్‌ఫ్రెండ్‌నే షూట్ చేసింది 19 ఏళ్ల‌ మోనాలిసా. చుట్టుపక్కల వాళ్లు దాదాపు 30 మంది చూస్తుండగా వీళ్లు ఈ స్టంట్ చేశారు. పెడ్రో రూయిజ్ ఛాతి ముందు పుస్త‌కం పెట్టి, 50 క్యాలిబ‌ర్ గ‌న్‌తో బాయ్ ఫ్రెండ్‌ను కాల్చేసింది మోనాలిసా. కాని పెడ్రో రూయిజ్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మోనాలిసాను పోలీసులు అరెస్టు చేశారు.  బాయ్‌ఫ్రెండ్‌ను షూట్ చేసిన ఈ ఈవెంట్‌ను రెండు కెమెరాల్లో బంధించగా.. ఆ కెమెరాల‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu