కోలుకున్న స్టాక్ మార్కెట్లు...


గత రెండు రోజులుగా నష్టాల్లో సాగిన స్టాక్ మార్కెట్లు ఈరోజు కాస్త కుదుటపడ్డాయి. ఈరోజు  ప్రారంభం నుండే లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు... మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 23 పాయింట్లు కోలుకుని 30,857 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 9,504 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో వేదాంత లిమిటెడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటాస్టీల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, సిప్లా లాభపడగా.. టాటామోటార్స్‌(డీ), కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎస్‌బీఐ, టాటామోటార్స్‌, టీసీఎస్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu