రెచ్చిపోతున్న పాక్... ఒక్క నెలలో 23 సార్లు

 


భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. మూడు రోజుల నుండి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాక్ ఈరోజు కూడా కాల్పులకు తెగబడింది. నిన్న జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీ జిల్లా భీంబర్‌ గలి(బీజీ) సెక్టార్‌లోని భారత పోస్టులను లక్ష్యంగా చేసుకొని పాక్ సైన్యం  మోర్టార్స్‌, ఆటోమేటిక్‌ వెపన్స్‌తో దాడులకు పాల్పడుతుంది. అయితే పాక్‌కు ధీటుగా సమాధానం ఇస్తున్నట్లు ఆర్మీ అధికారి తెలిపారు. కాగా జాన్‌లో మొత్తం 23 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ సైన్యం ఉల్లంఘించిందని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu